తెలంగాణలో ప్రశాంతంగా కొనసాగుతున్న మండలి ఓట్ల లెక్కింపు

6eusn43d

హైదరాబాద్‌: హైదరాబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, వరంగల్‌, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా కొనసాగుతోంది. హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాల ఓట్లను హైదరాబాద్‌ చాదర్‌ఘాట్‌లోని విక్టరీ మైదానంలో లెక్కిస్తున్నారు. వరంగల్‌-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఎన్నికల ఓట్ల లెక్కింపు నల్గొండలోని ఎన్‌జీ కళాశాలలో కొనసాగుతోంది. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి, 144 సెక్షన్‌ అమలు చేశారు. ఒక లక్ష 11వేల 766 ఓట్లు పోలయ్యాయని, 31 మంది అభ్యర్థులు ఈ ఎన్నికలో పోటీ పడుతున్నారని అధికారులు తెలిపారు. 28 టేబుల్స్‌ ఏర్పాటు చేసి 4 /ొండ్ల ద్వారా లెక్కింపు నిర్వహిస్తున్నామని, మొదటి /ొండ్‌ ఫలితం వెలువడడానికి 6 నుంచి 8గంటల సమయం పడుతుందని, పూర్తిస్థాయి ఫలితాలు బుధవారం అర్ధరాత్రికి గానీ, గురువారం తెల్లవారుజామున కానీ వెలువడే అవకాశం ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.