తెలంగాణలో ప్రైవేటు విశ్వవిద్యాలయాలు

4

– త్వరలో బిల్లు చేస్తాం

– సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌ నవంబర్‌26(జనంసాక్షి):

రాష్ట్రంలో త్వరలో ప్రైవేటు విశ్వవిద్యాలయాల బిల్లు తీసుకువస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. గురువారం రంగారెడ్డి జిల్లా కోకాపేటలో రాక్‌వెల్‌ ఇంటర్నేషనల్‌ పాఠశాల ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ప్రైవేటు విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు యూనివర్సీటీలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అంతర్జాతీయ విద్యాలయాల ఏర్పాటుకు హైదరాబాద్‌ అభివృద్ధిని సూచిస్తోందని కేసీఆర్‌ పేర్కొన్నారు. ఇందుకు అనుగుణంగా ప్రైవేటు యూనివర్సిటీ బిల్లు తేవడంపై ఆలోచిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. రాక్‌వెల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ యాజమాన్యానికి అభినందనలు తెలిపారు. మహేష్‌ బిగాల చిన్న వయసులోనే విద్యా సంస్థలను స్థాపించడం అభినందనీయమన్నారు. ప్రైవేటు యూనివర్సిటీ బిల్లు తేవడం ద్వారా విద్యారంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తసీఉకుని వెళ్లడమే గాకుండా, అందరికీ అవకాశాలు వస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రి మహేందర్‌రెడ్డి,ఎమ్‌ఎల్యే బిగాల గణేశ్‌ తదితరులు పాల్గొన్నారు.