తెలంగాణలో భారీగా ఇంజనీర్ల నియామకాలు
ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం
హైదరాబాద్,ఫిబ్రవరి11(జనంసాక్షి): తెలంగాణలో భారీగా ఇంజనీర్ల నియామకాలు జరగనున్నాయి. విద్యుత్ శాఖలో ఖాళీలు భర్తీ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. 1948 మంది ఏఈలు, 733 మంది సబ్ ఇంజినీర్ల నియామకానికి నిర్ణయించారు. మొత్తం 2,681 మంది ఇంజినీర్లను నియమించేందుకు నిర్ణయం తీసుకున్నారు. విద్యుత్ శాఖ మంత్రి లక్ష్మారెడ్డితో చర్చలు జరిపిన అనంతరం ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో చేపడుతున్న విద్యుత్ ప్రాజెక్టులు త్వరగా పూర్తి చేసి నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలంటే ఖాళీలు భర్తీ చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఇప్పటికే వాటర్ గ్రిడ్ కోసం ఇంజనీర్లను నియమించాలని నిర్ణయించారు. ఇప్పుడు వీటిని కూడా భర్తీ చేయనున్నరు. ఈ నియామకాలన్నీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా చేప్టనున్నారు.
బంగారు తెలంగాణ నిర్మాణం దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. సివిల్ ఇంజనీర్ల కొరతను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం భారీ నియమాలకాలకు శ్రీకారం చుట్టింది. ఉప్పటికే ఇరిగేషన్ శాఖలో తీవ్ర కొరత ఉంది. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మిషన్ కాకతీయ చెరువుల పునరుద్ధరణ కార్యక్రమాలు వాటి డిజైన్లకు కూడా సరిపడా ఇంజనీర్లు లేరు. క్షేత్ర స్థాయిలో నిపుణుల కొరత ఉంటే నాణ్యతా ప్రమాణాలు దిగజారే అవకాశాలున్నాయి. ఇంటింటికీ నీటిని అందించాలన్న మహోన్నత లక్ష్యంతో ప్రారంభించనున్న వాటర్ గ్రిడ్‌తోపాటు పెండింగ్ ప్రాజెక్టులు, చెరువుల పునరుద్ధరణ కార్యక్రమాలేకాక ఆయా గ్రామాల్లో నిర్మించే సీసీ రోడ్ల నిర్మాణం, డబుల్ బెడ్‌రూంల నిర్మాణం తదితర పథకాల అమలుకు అవినీతి లేకుండా జనాన్ని చేరేలా సిబ్బంది కొరత లేకుండా చూస్తోంది. ప్రధానంగా విద్యుత్ సమస్య తెలంగాణకు ప్రధాన సమస్యగా మారటంతో ఆ శాఖలో వెంటనే నియామకాలు చేపట్టాలని సీఎం నిర్ణయించారు.