తెలంగాణలో వచ్చేది టిఆర్‌ఎస్‌ ప్రభుత్వమే

స్వామివారిని దర్శించుకున్న తలసాని
హైదరాబాద్‌,సెప్టెంబర్‌27(జ‌నంసాక్షి):  తెలంగాణలో వచ్చే ఎన్నికలలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికే ప్రజలు పట్టంకడుతారని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. గురువారం ఉదయం వీఐపీ విరామ సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు స్వామి దర్వనం కల్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ  టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలపై రాష్ట్ర ప్రజలు సంతృప్తిగా ఉన్నారని, టీఆర్‌ఎస్‌ వైపే ప్రజలు మొగ్గు చూపుతున్నారని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వచ్చి మరిన్ని సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తామని తెలిపారు. అన్ని సర్వేలు కూడా టీఆర్‌ఎస్‌ కు అనుకూలంగా వచ్చాయని, స్వామి వారిని కూడా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గెలుపొందేలా ఆశీర్వదించాలని కోరుకున్నానని తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు.