తెలంగాణలో శాంసంగ్‌ అకాడమీ ఏర్పాటు

5

హైదరాబాద్‌,జులై 25(జనంసాక్షి):తెలంగాణలో సామ్‌ సంగ్‌ అకాడవిూ ఏర్పాటు చేయనున్నట్లు ఐటి శాఖ మంత్రి కె.తారక రామారావు తెలిపారు. తెలంగాణ అకాడవిూ అప్‌ స్కిల్స్‌ అండ్‌ నాలెడ్జ్‌ సామ్‌ సాంగ్‌ అద్యర్యంలో ఈ టైజన్‌ ( అపరేటింగ్‌ సాప్ట్‌ వేర్‌) అకాడవిూ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ అకాడవిూ ద్వారా సామ్‌ సంగ్‌ కోసం యాప్స్‌ తోపాటు ఇతర సేవల తయారీచేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే టైజాన్‌ సాప్ట్‌ వేర్‌ విూద సూమారు 500 మంది విద్యార్దులు, 75 మంది ప్యాకల్టీ శిక్షణ కార్యక్రమం పూర్తియినట్లు తెలిపారు. ఇప్పటికే టాస్క్‌ తరపున తయారుచేసిన యాప్స్‌ లో 13 యాప్స్‌ ని షార్ట్‌ లిస్ట్‌ చేసిన సామ్‌ సంగ్‌ రిసెర్చ్‌ సంస్ధ (బెంగళూర్‌ ) మెదటి మూడు స్థానాల్లో నిలిచిన వారికి బహుమతి ప్రదానోత్సవం టాస్క్‌ కార్యాలయంలో జరిగింది. వీరికి తదుపరి శిక్షణను సంస్ధ అందించనున్నది.తాము తయారు చేసిన యాప్స్‌ ని విద్యార్దులు మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి టాస్క్‌ ద్వారా ఇప్పటికే 40 వేల మందికి శిక్షణ ఇచ్చామన్నారు. విద్యార్దులను హైదరాబాద్‌ వచ్చి శిక్షణ తీసుకోమని చెప్పకుండా టాస్క్‌ ప్రతినిధులే జిల్లాలకు వెళ్ళి శిక్షణ ఇవ్వడం ద్వారా గ్రావిూణ ప్రాంత యువతకు ఏంతో మేలు చేస్తున్నదన్నారు. నిరుద్యోగ యువతకు, విద్యార్దులకు శిక్షణ ఇచ్చేందుకు టాస్క్‌ ని మరింతగా విస్తరిస్తామన్నారు. ఈ టైజేన్‌ అకాడవిూ ద్వారా సామ్‌ సంగ్‌ తో తెలంగాణ భాగసామ్యం మరింత ముందుకు వెళుతుందన్ని అశాభావం వ్యక్తం చేశారు. టి హబ్‌ తో ఓక యంవోయుని ఈ సందర్భంగా చేసుకోవడం జరిగింది. పరిశోధనలకు ఉతం ఇస్తూ ఉద్యోగాలు కల్పించే వారికోసం టిహబ్‌ ఏర్పాటు చేస్తే, ఉద్యోగాలు వెతుక్కునే వారికి సహయ పడేందుకు టాస్క్‌ ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. విద్యార్దులు మతం, అందం, ప్రజాసేవలవంటి రంగాల్లో ప్రజలకు ఉపయోగపడే పలు యాప్స్‌ ని తయారు చేశారు. ఈ యాప్స్‌ లో విద్యార్దుల నైపుణ్యం సీనియర్‌ సామ్‌ సంగ్‌ఉద్యోగుల స్ధాయిలో ఉందని సామ్‌ సంగ్‌ ఉపాద్యక్షుడు దీపక్‌ తెలిపారు. ప్రభుత్వరంగంలోని సంస్ధ ఇలా విద్యార్దులను అన్ని రంగాల్లో శిక్షణ ఇవ్వడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. విద్యార్దుల ఉత్సహం, ప్రభుత్వ ప్రోత్సాహం చూసిన తర్వతా టైజాన్‌ అకాడవిూ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. టాస్క్‌, టి హబ్‌ ద్వారా చేసుకున్న ఈ యంవోయు ద్వారా మరింత నైపుణ్యం బయటకు వస్తుందన్న అశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో టాస్క్‌ సియివో సుజీవ్‌ నాయర్‌, టి హబ్‌ సివోవో శ్రీని కొల్లిపార, ఐటి శాక కార్యదర్శి జయేష్‌ రంజన్‌ లు ఉన్నారు.