తెలంగాణవాదుల విజయం : అల్లం నారాయణ

హైదరాబాద్‌,(జనంసాక్షి): ఛలో అసెంబ్లీలో తెలంగాణవాదులు విజయం సాధించారని తెలంగాణ జర్నలిస్ట్‌ ఫోరం అధ్యక్షుడు అల్లం నారాయణ చెప్పారు. కిరణ్‌ కుమార్‌ రెడ్డి ప్రభుత్వం దమనకాండ సృష్టించిందన్నారు. భవిష్యత్‌లో కూడా తెలంగాణవాదం వినిపిస్తామని ఆయన చెప్పారు.