తెలంగాణా పై కేంద్రం హమీని నిలుపుకోలేదు: వెంకయ్య నాయుడు
ఢిల్లీ: తెలంగాణ విషయంలో ఇచ్చిన హమీని కేంద్ర ప్రభుత్వం నిలుపుకోలేదని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు అన్నారు. తెలంగాణ విషయంపై ఉభయసభల్లోనూ కేంద్రాన్ని నిలదీస్తామన్నారు. నల్లధన కుబేరుల జాబితాను వెల్లడించాలని కేంద్రాన్ని కోరినట్లు వెంకయ్యనాయుడు తెలిపారు. నేడు భాజపా పార్లమెంటరీ పార్టీ భేటీ జరిగిన నేపధ్యంలో ఆయన పై విషయాలు
స్పష్టంచేసారు.