తెలంగాణ అంశాన్ని తేల్చాల్సింది కేంద్రమే ఎంపీ అసరుద్దీ ఒవైసీ
సంగారెడ్డి (పట్టణం): ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర అంశాన్ని తేల్చాల్సింది కేంద్రమేనని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. శుక్రవారం సంగారెడ్డి కోర్టుకు హాజరైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే తెలంగాణ అంశంపై తమ పార్టీ అభిప్రాయాన్ని స్పష్టం చేశామన్నారు. రాష్ట్రంలో రాజకీయ పార్టీలన్నీ తెలంగాణపై ఇప్పటికే తమ నిర్ణయాన్ని చెప్పాయని. ఇక తేల్చాల్సింది కేంద్రమేనని ఆయన అన్నారు. తెలంగాణ కోసం ఆత్మహత్యలు చేసుకోవద్దని ఆయన యువతకు సూచించారు.