*తెలంగాణ అభివృద్ధి నిధులు కేంద్రానివే – డీకే అరుణ*

పెద్దేముల్ జూలై 26 (జనం సాక్షి)
తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి నిధులన్నీ కేంద్ర ప్రభుత్వానివెనని బిజెపి జాతీయ ఉపాధ్యక్షుల మహిళా ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పేర్కొన్నారు. మంగళవారం నాడు వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజకవర్గంలోని పెద్దేముల్ మండలంలో ప్రజాగోస బీజేపీ భరోసా యాత్రను ప్రారంభించారు. మండలంలోని కందనెల్లి, మంబాపూర్, జనగాం, మారేపల్లి, గ్రామాల మీదగా కోటిపల్లి వరకు ఈ యాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా జాతీయ బిజెపి మహిళా ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వం ఏర్పాటు ఖాయమన్నారు. తెలంగాణ ప్రజలను మోసం చేసి నెరవేర్చని హామీలు ఇచ్చి, ప్రజలను నిరాశపరచిన సీఎం ఎవరైనా ఉన్నారంటే ఒక కల్వకుంట్ల చంద్రశేఖర రావు అని అన్నారు. ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న టిఆర్ఎస్ నాయకులకు తెలంగాణ రాష్ట్రంలో పుట్టగత్తెలు ఉండాలని తెలిపారు. ఇప్పటికే జరిగిన జిహెచ్ఎంసి, దుబ్బాక, హుజురాబాద్ ఎన్నికల్లో టిఆర్ఎస్ నాయకులు బిజెపి ప్రభంజనం ఎలా ఉంటుందో చూశారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతున్న పల్లెల్లో గాని, పట్టణంలో గాని కేంద్ర నిధులతోనే జరుగుతుందని ఏద్దేవ  చేశారు. బిజెపి ప్రజా విశ్వాసాన్ని చూస్తుంటే వచ్చే ఎన్నికల నాటికి ప్రతి నియోజకవర్గంలో బిజెపి జెండా ఎగరవేయడం ఖాయమన్నారు. నరేంద్ర మోడీ మీద ఉన్న నమ్మకంతోనే ప్రజలు మోడీ ని రెండుసార్లు ప్రధానిగా పదవి చేపట్టారన్నారు.
కేంద్రంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో డబుల్ ఇంజన్ సర్కార్ ప్రయాణిస్తుందన్నారు, దేశంలో 18 రాష్ట్రాల్లో బిజెపి అధికారంలో ఉందని కెసిఆర్ గుర్తించుకోవాలన్నారు. తాండూరు నియోజకవర్గంలో నిర్వహించిన ప్రజాగోస బిజెపి భరోసా యాత్రకు విశేష స్పందన లభించిందని ఈ సందర్భంగా డికె కరుణ తెలిపారు.
ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు సదానంద రెడ్డి, మాజీ అధ్యక్షులు కరణం ప్రహ్లాద రావు, వికారాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి యు రమేష్, జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు సాహు శ్రీలత, పెద్దేముల్ మండల బిజెపి అధ్యక్షులు సందీప్ కుమార్, కౌన్సిలర్లు అంతారం లలిత, బంటారం లావణ్య, రజినీకాంత్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు