తెలంగాణ అలాయ్ బలాయ్
గోనెపట్టా పక్కకనుకుంట లొపల్కి పోయ్యి ముక్కు పల్లోతొ కూసుందొ లేదో కాళ్ళనిండ ఏందో పారుతున్నట్టయింది. పరీక్షగా చూస్తె బొద్దింకలు…చీమలు…ఎలుకలు గూడ తిరుగు తున్నట్లుంది.ఆమె మోకాలు ఎక్కిందోక బొద్దింక. దాన్ని విదిలించుకుంట భయంతోని ఒక్క గెంతుల బయటకొచ్చి పడ్డది షమీమ్ ఆ చీకట్ల అట్ల ఒంటరిగ కొద్దిసేపు నిలబడ్డది.ఏం చెయ్యాల్నో ఏమో అంతా అయోమయంగా అన్పించింది షమీ మ్‌కి.
జలీల్‌కి చెప్దామంటే సిగ్గేసిందిద.పోని చెంబు పట్టుకోని ఆరుబైటికి ఎల్లాల్నంటె జనానా (ఆడ వాళ్లు) అట్లా పోడానికి లేదు . అందులోనూ కొత్త దుల్హన్ .ఆ రాత్రి అన్నం కూడ తినకుండ పండు కుంది షమీమ్ .
తెల్లారి లేసి ఇక తప్పదన్నట్లు ప్రాణాన్ని అరచే తుల పెట్టుకోని ముక్కు మూసుకుని సండాస్‌ల కూసుంది ముళ్ళమీద కూసున్నట్లు .కాని ఎంతకి దోడ్డికి రాలె
రూంల కెళ్ళంగనె ఎక్కెక్కిపడి ఏడుపొచ్చింది షమీమ్ కి ఏడుపు విని ఏమేందేమైనందనుకంట అందరోచ్చిన్రున రూంల్రకు
‘పేట్ మే దర్డ్ హొతాహై క్యా’? అంది అమ్మీజీ .
‘ఏమైనాలో సమజ్‌కాక ఏడ్చుకుంటనే తలూపింది షమీమ్ .
‘దవాఖానాకు ఎళ్దామా? ‘ అడిగింది అమ్మీజీ
‘మైమనాలో సమజ్‌కాక ఏడ్చుకుంటనే తలూపిం ది షమీమ్
‘ఫిర్ తుమారే గావ్ మే జాతే క్యా ?’ అన్నడు జలీ ల్ ప్రాణం లేచొచ్చినట్లే గబగబ తలూపింది షమీ మ్ .
అందరేమనుకుంటరే అనుకుంటనే అమ్మీజీ తయారు చేసి పంపింది ఇద్దర్ని .అక్కడికీ నామీ మా అడగనే అడిగింది.అందర్కి ఏదో సర్ది చెప్పిం ది అమ్మీజీ
‘సోడా పీతే ? ‘ జలీల్ తట్టి లేపి అడుగుతుండు .ఈ లోకంలో కొచ్చి ‘నక్కో’ అంది షమీమ్ .ఇంకో గంటకు వాళ్ళురోచ్చింది .బస్టాండ్ బయటకోచ్చి రిక్షా మాట్లాకుని ఇంటికి పొయిన్రు ఇద్దరు.
అందరికి సలాములు చెప్పుకుంటనే ఇంటెనక లెట్రిన్‌లకి పొయ్యి తలుపేసుకుంది షమీమ్
చాలా సేపటికి నోప్పితో రక్తంతో విరేచనమ య్యింది.చాలా భయమేసింది షమీమ్‌కి ఎప్పుడు ఇట్ల కాలె.ఇట్లంటె కయ్యింది? రెండ్రెజుల్నించి బ యట కెళ్ళాలె కదా అనుకుని నోప్పితోనె ఇంట్ల కోచ్చింది.
అందరు అదుర్దాగా ఎందుకుచూస్తున్రు. వీర్సంగా నవ్వి’ నాకే కొద్దిగా కడుపు నొప్పిగ అన్పిస్తే వచ్చి నం అమ్మీ… ‘ అని అందరు హమ్మయ్య అని ఊపిరి తీసుకున్రు అమ్మీ అన్నది,
‘ నేను చాచాని పంపుదా మన్నకున్న పహెలి జుమ్మాగీకి ‘
‘ఎట్లాయితేందమ్మి,మేమే వచ్చినంగ’ అన్నది షమీ మ్‌నవ్వుకుంట .
సాలీలిద్దరూ భాయి జాన్ (బావా) మస్తుగ ఏడిపిం చిన్రు.ఇగ అన్నం తిని ఎక్కడోల్లు అక్కడ పండు కున్నరు .షమీమ్ నిద్దర పడ్తలె – సైకిల్ షా ప్ కాబట్టి ఇక్కడ గూడ మంచిగనె నడు స్తది .ఇక్కడ్న యితె ఇల్లు ,లెట్రిన్ అన్ని ఉన్నయ్ ఈడికోచ్చేస్తే మంచిగుండు.రేపు అమ్మీకి చెప్పి ఈసకి చెప్పిస్త ..ఆలొచన్లనతోని అటుఇటు దొర్లబట్టింది.ఇంతట్ల ఇంట్ల నుంచి సప్పుళ్లు ఇనరాబట్టినయి.ఏందా అని సూడనీకి షమీమ్ ఎనక రూంలకు పోయ్యిం ది .చిన్నచెల్లె సజ్జపై నుంచి సామాను అందిస్తుంటే కట్టి ఒక మూలకు పెడ్తుంది. షమీమ్‌కేం సమాజ్ కాలె.
‘ కై కమ్మీ ఏ సోబే ?’ అనడిగింది.
అమ్మీ కొద్ది సేపేం మాట్లాడలె .అట్లాంక కళ్ళెంట నీళ్ళోత్తుకుంట, ‘ ఏ ఘర్ బేచ్ దియేనా బేటి! షా ది కి ఇల్లు అమ్మటం తప్ప ఏం చెయ్యాల్నొ తోచ లె..! అని చిన్నపిల్లలా బోరుమని ఏడ్చిం ది.షమీమ్‌కి కూడా ఏడుపొచ్చింది.
‘అరె అమ్మీ… నక్కొరో …’ అని సమ్జాయించు కుంట’ ఫిరి అబ్ కార్రహేంగే ?’ అనడిగింది. ‘గా వ్ర్‌కే కోనేమే ఏకే కిరాయిక ఘర్ మిలా బేటి( ఊరి చివరకు ఒక కిరాయిల్లు దొరికింది బేటి! )’ అంది అమ్మీపల్లొతో ముక్కు తుడ్చుకుంట .
ఇద్దరు చెల్లెళ్ళు ఫర్హానా ‘ఆపా! ఓ ఘర్ కవేలీకా భీ నై , టీనోంకా (రేకుల్ది). థోకా భీ అచ్చానైహై’
ఛోటీ బహెన్ అపా! ఆపా ఆపా! ఓ ఘర్ మే పా య్‌ఖానా భినైహై… ఖాలీ సండాస్ హై (ఉత్త సండాసేఉంది)’అంది దిగులుగ…
-షాజహానా
ముసీబత్
రోజు లెక్కగాక ఆ దినం జర జల్దీగా నిద్రలేసిన జరూరత్ పూరి జేస్కొని చేత్ల లాల్ దంత్ మంజల్ గింతేస్కోని పళ్ళు తోముటకుంట హమామ్ బడి లో వుండాలే . లేకపోతే కఠినమైన శిక్ష . గ్రౌండ్ మొత్తం పదిసార్లు వుర్కాలంట.గందుకే గా భయం తొటే పోటాపొటి పడ్త్నునూ ముఖం కడ్గుకోటాన్ని ఒక్కసారె హమామ్‌ల దూరి ఒకటె కోట్లాట, షరా రత్ జేస్రునూ.
ధేఖో బాబా మై పహిలే ఆయాతో.ఇన్ బాద్‌మే ఆయా నేను ముందంటె నేను ముందు అని ఒకటే జిద్దు చేస్తు కొట్టు కుంన్రూ ఉట్టి చేతులతోనే . ఒకటిది కుడిచెయ్యి ఒకటిది ఎడమచెయ్యి మధ్య లొ నోరు గొల నాకు దిమాగ్ గరం ఐపొయింది.
అరేయి..ఎందుకు కొట్లాడుకుంటార్రా .బేజలేద్రా ఒకళ్ళు తర్వాత ఒకళ్ళు తయ్యార్ కాండి జల్దీ జ ల్దీగా అని బెదిరించినా ,నోర్లు మూత పడ్డాయి .తయ్యార్ చాయ్‌ల గిన్ని చిన్ని బిస్కట్లు ఏస్కోని తిన్నరు బడి డ్రస్తు ,బూట్లు ,టై గిట్లా తోడ్గి ,సైకిల్ల మీద ఇస్కూల్కి పొయిన్రూ .
నాకున్న ఏక్ బేటి అంజూంకి జడ ఏస్తుంది కస్సు బుస్సు మంటతో ,నేన్ గూడ చాయ్ తాగి కుర్చీ మీద కూసున్న సిరేటు తాగుతూ ,పిల్లంతా బడ్కి పొయిన్రూ .ఇల్లంతా ఖముష్ ఐపోయింది .పిల్లల కీచులాట లేక ఊకె కూపోని ఏం జేయా ల్నని కద ¸లు ముందలేసుకున్న ప్రూఫ్ చూస్తు ,అగో గప్పు డే వచ్చిండు ,లయూఖ్ తమ్ముడు రహీం హీరొ హోండానిక్కి ఇంటి గల్లిల కెల్లి లోపల్కి వచ్చిం డు కుంటుకుంటు ,రహీం లంగ్డా కావడాన్కి ఒక పెద్ద కారణం ఉంది .రహీం రహెమాన్ ఇద్దరు కవలపిల్లలు ,బాగానే సద్వు సంధ్యలు అబ్బినాయ్ ,ఒకసారి పట్నం పోయిండు సుట్టాలను చూట్టాల ను చూడటాన్కి అప్పుడే ఆయన ఖలేర భాయి సౌదికి పోతుండు . విమానాశ్రయం దాక సాగనం పటాన్కి హీరొ హోండ మీద పొతున్రూ, ఎక్క నుండి ఇంకో బండి వచ్చి గుద్దింది.పెద్ద ఏక్సిడెం టు ఐంది. కాలు యిర్గింది. దవాకాన్ల పరీక్ ఐం డు. అరలక్ష ఖర్చు పెట్టి కాలు నయం జేపిచ్చిం డు, పెద్దన్నయ్య లయిఖ్ . కాలు బొక్క అతు క్కుంది గాని,కాలు కాస్త పీక్కుపోయింది, కుంటి తనం మిగ్లిపోయింది.
ఆలీ భాయ్…అలీ భాయ్..కువైత్ నుండి ఫోన్ వచ్చింది. ఫయ్యజ్ భాయిజాన్కి సీరియస్‌గుందట, నిన్ను జల్దీ పిలుచుకురమ్మన్నరు. హైబత్ల ఆన్నా బైటపడకుండ మాములుగానే చెప్పిండు. నా మీద పిడుగు పడ్డట్లైంది. ఒక్కసారె అదిరిపడ్డ ఆరె… ఏమైందిరా భాయి,ఎప్పుడు రాంది మా ఇంట్కి వచ్చినావ్. ఏంలేదు…రా…పోదాం.
ప్రూఫ్ చూస్తున్న కథలను నూకేసిన సంచిలో బట ్టలు తోడుక్కోని వెంట బోయ్ని బండి మీద, మా భాయి జాన్ ఇంట్కి.అక్కడంతా తూఫాన్ తర్వాతి ప్రశాంతం అవరించి ఉంది. అంతా దీర్ఘాలోచన లో పడి ఖమూష్ గున్నరు. నా ఊపిరి ఆగినట్లు ఐతుంది నాకు. క్యా హువాజీ? క్యా హువా? నన్ను పక్కకు తీస్కపోయి చిన్నగా చెవిల ఊదిండు షమీమ్ ఫయ్యాజ్ ఆలీ కా ఇన్తెఖాల్ హువా కైసా హువా? అచ్చేథేనా? హార్ట్ ఎటాక్. హార్ట్ ఎటా క్…హార్ట్ ఎటాక్…హార్ట్ ఎటాక్.. నా చేవిలో గింగిరాలు తిరుగుతంది. నా కాలి కింద నేల కంపించిపోయింది. కాళ్ళు చచ్చుబారిపోతున్నా య్. కండ్లు భైర్లు కమ్మినాయ్ .నీళ్ళు కారిపోతు న్నాయ్. ఐనా నాకు సోయి లేదు. పండ్ల సందుల్లో బాధను ఎంతగా బిగబట్టిన తన్నుకోస్తుంది. బైట్కి ఎగచిమ్మె లావా లెక్క భళ్ళున యెదలోన బాద నంత కక్కుకున్నాను. ఎంత పని జర్గిపాయ్. ఎంత ఘోరం జర్గిపాయ్. ఇప్పుడెట్లా……?సర్దార్ అలీ పుప్పాకు ఐదుగురు కొడుకులు, ముగ్గురు బేటిలు. బడ బేటా, జిలాని, మంజ్ల బేట అహ్మద్ గార్కి అభ్కారీలో నెంబరందాజ్ నౌకరీలు దోర్కి నాయి. జిలాని భాయికి హుజూర్ నగర్‌లో నౌకరి. ఆడ పుగట్‌నగర్‌లో పూరిల్లు గట్టుకోని అంతా అక్కడే వూండేవాళ్ళు.అప్పటికి ఇద్దరు కొడుకులకు ఇద్దరు బేటిలకు షాదీలు జేసిండు పుప్పా. మూడో బేట ఫాయ్యజ్ అలీ మా నాయన గౌస్‌సాబ్‌కు హుజూర్ నగర్ తబాదిలా ఐంది. అప్పుడు నేను కోదా డలో కాలేజ్ చేస్తున్నాను. గౌస్ సాబ్ పోలీస్ శాఖ లో కానిస్టేబుల్‌గా నౌకరి. ఫయ్యజ్ అలీకి నాకు సుమారు ఒకటే వయస్సు . మా అంటే ఐదార్నెల్ల తేడా. చిన్నప్పుడు మేమిద్దరం బాగా లావుగా దుం డు దుండుగా వుండేవాళ్ళమట. వల్‌పటా, దాపట అని పిలిచేవారంట. గట్టనే పెద్దగైనంక మా దోస్తా న కల్సింది. మేమ్ జిగ్రి దోస్తులమైనాము. ఎక్కడి కైన కల్సి మెల్సి తర్గేటోల్లం ఫయ్యజ్ జీపు కారు డ్రైవరు. జిలాని భాయి అబ్కారి దాంట్లోనే డ్రైవర్ పని కుదిరిచ్చిండు. అభ్బా అమ్మీలు పెద్ద మనుషు లైన్రూ, ఆయన కూడ అబ్కారిలో నౌక్రి చేసి వజా ట్ల బరువు తీస్కుండు. అంత యి ఇంటి పెద్దా యన మీద పడ్డది.అక్కాచెల్లెళ్ళను తమ్ముళ్ళను అల్లారుముద్దుగా చూస్కుండు. మాకుటైం దొర్కిన ప్పుడల్ల సిన్మాలు, చేపల షికార్లు ఒక్కటేంది ఎక్కడ చూసిన మేమిద్దరమే జోడిదార్లం. ప్రేమ ముచ్చట్లు బాతాఖాణి ప్రాణానికి ప్రాణం.
-వేములఎల్లయ్య,స్కైబాబ ఇంకావుంది…