తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను విజయవంతంగా నిర్వహించాలి… జిల్లా కలెక్టర్ గోపి.. జెడ్ పి.లో 6 గంటలకు కవి సమ్మేళనం .. ఫోటో రైట్ అప్: ఖుష్ మహల్ పరిసరాలను పరిశీలిస్తున్న కలెక్టర్… వరంగల్ బ్యూరో: జూన్ 1 (జనం సాక్షి)

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను  విజయవంతంగా నిర్వహించాలని        వరంగల్ జిల్లా కలెక్టర్ గోపి అన్నారు.
బుధవారం వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ తో కలిసి   ఆవిర్భావ దినోత్సవ
 వేడుకలు జరిగే ఖిలా వరంగల్ లోని కుష్ మహల్ ప్రాంగణం ను వరంగల్ కలెక్టర్ డాక్టర్ గోపి
 ఎమ్మెల్యేపరిశీలంచారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జూన్,02 న నిర్వహించనున్న తెలంగాణ ఆవిర్బావ దినోత్సవ వేడుకల కు ముఖ్య అతిధి గా రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మాత్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు విచ్చేస్తారని తెలిపారు.ముందుగా అమరవీరులకు నివాళులు అర్పించి ఉదయం 9 గంటలకు జాతీయ పతాకావిష్కరణ  చేసి మంత్రి  గౌరవ వందనం స్వీకరిస్తారని పేర్కోన్నారు.జిల్లా ప్రగతి మీద మంత్రి సందేశాన్ని ఇస్తారని  కలెక్టర్ తెలిపారు.  దాని వెంటనే అమర వీరుల కుటుంబాలకు సన్మాన కార్యక్రమం ఉంటుందన్నారు.9:30 గంటలకు సాంస్కృతిక ప్రదర్శన లు,9:50 కి ఉత్తమ ఉద్యోగులకు ప్రశంస పత్రాల ప్రధానం10:10 గంటలకు స్టాల్స్ సందర్శన ఉంటుందని కలెక్టర్ తెలిపారు. సాయంత్రం 6.00 గంటలకు  జిల్లా పరిషత్   కవి సమ్మేళనం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఆవిర్బావ దినోత్సవ వేడుకలకు ఉదయం 8.30గంటలకు అన్ని శాఖల అధికారులు, సిబ్బంది హాజరు కావాలని కలెక్టర్
ఆదేశించారు.