-తెలంగాణ ఉత్తమ లైన్స్ క్లబ్ గవర్నర్ గా నాగర్ కర్నూల్ వాసి రాధాకృష్ణ ఎంపిక.

-ఇంటర్ నేషనల్ ప్రెసిడెంట్ ఎపి సింగ్ చేతులమీదుగా అవార్డు అందుకున్న రాధాకృష్ణ.
-సంస్థ బలోపేతానికి కృషి చేస్తా.
-అవార్డు గ్రహిత లయన్స్ రాధాకృష్ణ.
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,ఆగష్టు30(జనంసాక్షి):

లయన్స్ క్లబ్ జిల్లా గవర్నర్ గా ఉత్తమ సేవలు అందించి అనేక విభాగాలలో 320ఎ జిల్లా ను తెలంగాణ రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిపిన గవర్నర్ రాధాకృష్ణ ఉత్తమ జిల్లా గవర్నర్ గా ఇంటర్ నేషనల్ ప్రెసిడెంట్ ఎపి సింగ్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు.ఈనెల29 సోమవారం రాత్రి హైదరాబాద్ లోని కెవిఆర్ కన్వెన్షన్ సెంటర్ వేదికగా జరిగిన రాష్ట్ర స్థాయి అవార్డు ల ప్రధానోత్సవ కార్యక్రమం లో ఈ అవార్డు ను అందుకున్నా రు.రాధాకృష్ణ పదవీ కాలంలో 80 లయన్స్ క్లబ్బుల ద్వారా అనేక సేవా కార్యక్రమాలు అనగా రక్తదాన శిబిరాలు, మొక్కలు నాటే కార్యక్రమాలు,మీల్స్ ఆన్ వీల్స్ వాహనాల ద్వారా అన్నదాన కార్యక్రమాలు, ఆరోగ్య శిబిరాలు, కంటి పరీక్షలు, ప్రభుత్వ పాఠశాల లో లైబ్రరీ లు,ఆట వస్తువుల పంపిణీ,వాటర్ ట్యాంకులు ఇవ్వడం, గ్రామీణ ప్రాంతాలలో ఉన్న క్లబ్బుల ద్వారా బాడీ ఫ్రీజర్ల నిర్వహణ ,బ్లడ్ బ్యాంకు నిర్మాణం,మధుమేహ నివారణకు, క్యాన్సర్ బారిన పడకుండా తీసికోవలసిన జాగ్రత్తలు గురించి ,పర్యావరణ పరిరక్షణ , కంటి చూపు పరిరక్షణ గురించి కరపత్రాల పంపిణీ, గర్భిణీ స్త్రీలకు పోషక ఆహారం పంపిణీ,అన్ని క్లబ్బులకు డయాబెటిక్ కిట్స్ పంపిణీ,ప్రభుత్వ పాఠశాలల దత్తత, అనాధ ఆశ్రమాలకు చేయూత ఇటువంటి ఎన్నో నిరుపేద లకు సేవలు అందింప చేయుటకు సరియైన దిశా నీర్దేశం చేసినందుకు మల్టీపుల్ చైర్మన్ డా. గుర్రం శ్రీనివాస్ రెడ్డి, గవర్నర్ రాధాకృష్ణ ను ఈ అవార్డు కు ఎంపిక చేశారు.అవార్డు అందుకున్న గవర్నర్ రాధాకృష్ణ కు మాజీ గవర్నర్ లు, అన్ని క్లబ్ ల సభ్యులు, నాగర్ ర్నూల్ లయన్స్ సభ్యులు అభినందనలు తెలిపారు.ఈ సందర్బంగా రాధాకృష్ణ మాట్లాడుతూ డిస్ట్రిక్ట్ గవర్నర్ గా అంకిత భావంతో పనిచేసినందుకు రాష్ట్ర స్థాయిలో అవార్డు అందుకోవడం చాలా సంతోషం కలిగించిందని రానున్న కాలంలో లయన్స్ సేవా సంస్థ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని అవార్డు అందించిన మల్టీపుల్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి కి, గ్లోబల్ యాక్షన్ టీం నాయకుడు సునీల్ కుమార్ కి కృతజ్ఞతలు తెలియ చేశారు.