తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఓపెన్ టెన్త్,ఇంటర్ నవంబర్ 10 వరకు అడ్మిషన్లు పొందేందుకు ఇదే చివరి అవకాశంగా ఉందని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నేరేడుచర్ల స్టడీ కోఆర్డినేటర్ శ్రీనివాస్ రావు,సహాయ కో ఆర్డినేటర్ నరసింహా రావు ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ,చదవడం రాయడం వచ్చిన వారు పదో తరగతిలో అడ్మిషన్లు పొందవచ్చునని,10వ తరగతి పాసైన వారు ఇంటర్మీడియట్ ఏదో ఒక గ్రూప్ తీసుకునే అవకాశాలు ఉందన్నారు. ఒకే సంవత్సరంలో ఇంటర్ పూర్తి చేసుకునే అవకాశం ఉన్నందున ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.పదవ తరగతి అడ్మిషన్,కోసం రికార్డు షిట్,టి.సి,ఆధార్,కుల దృవీకరణ పత్రం అందజేయాలని ఇంటర్ అడ్మిషన్ల కోసం పదవ తరగతి మోమో,ఆధార్ కార్డు,కుల దృవీకరణ పత్రం అందజేయాలని సూచించారు.ఇదే చివరి అవకాశంగా భావించి అడ్మిషన్లు పొందాలని కోరారు వివరాలకు 9703238224,98669 74317 ఫోన్ నెంబర్లకు సంప్రదించాలని కోరారు.