తెలంగాణ కోసమే కేసీఆర్‌తో చర్చలు
తెలంగాణ రాష్ట్రం కోసమే తమ పార్టీ ఢిల్లీ పెద్దలు తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుతో భేటీ అయ్యారని కాంగ్రెస్ సీనియర్‌నేత కె. కేశవరావు అన్నారు. తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకుంటున్నారని, మేం అందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. తనకు ఏ పదవి పైనా ఆశ లేదని తాము కోరుకునేది, తెచ్చుకునేది, సాధించుకునేది తెలంగాణ మాత్రమేనని అన్నారు. తెలంగాణ తెచ్చేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నామని చెప్పారు. తన జీవితం ప్రజలకోసం, తెలంగాణ కోసమే అంకితమన్నారు. తమకు