తెలంగాణ పాలకుల అవినీతి తో అప్పుల తెలంగాణ గా మారింది

హామీలు ఘనం అమలు శూన్యం
మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం, జులై   (జనంసాక్షి):- టిఆర్ఎస్ అరాచక పాలనతో దగా పడిన రాష్ట్రం మండల కేంద్రంలో ప్రజా గోస బిజెపి భరోసా యాత్రను ఆదివారం మండల బిజెపి అధ్యక్షులు తాండ్ర రవీందర్ ఆధ్వర్యంలో ఆ పార్టీ శ్రేణులు ప్రారంభించారు. కార్యక్రమంలో చేవెళ్ల మాజీ పార్లమెంటు సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొప్పు భాష, రాష్ట్ర కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి మర్పల్లి అంజయ్య యాదవ్,  బిజెపి జిల్లా అధ్యక్షులు బొక్క నరసింహారెడ్డి ఇతర జిల్లా, మండల నాయకులు పాల్గొన్నారు.  యాచారం, మొండిగౌరెల్లి, చింతపట్ల, నల్లవెల్లి, పలు గ్రామాల మీదుగా యాత్ర కొనసాగిస్తు పార్టీ జెండాలను ఆవిష్కరించారు. కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఇతరులు మాట్లాడుతూ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల కొరకు పుట్టిన పార్టీ కాదని కేసీఆర్ కుటుంబానికి, కుటుంబ స్వార్థం  కోసం పుట్టిన పార్టీ అన్నారు. టిఆర్ఎస్ అరాచక పాలనతో తెలంగాణ ప్రజలు దగా వడ్డారని మిగులు బడ్జెట్ తో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో పాలకుల అవినీతితో అప్పుల తెలంగాణగా మారిన దుస్థితి నెలకొందని అన్నారు.   రాష్ట్రంలో  రైతులకు తాము పండించిన పంటలకు మద్దతు ధర ఇచ్చేది కేంద్ర ప్రభుత్వమేనని ఇన్నాళ్లు సీఎం కేసీఆర్ మాత్రం రైతులకు తామే మద్దతు ధర ఇస్తున్నామని అబద్ధాలు చెబుతూ వచ్చారని అన్నారు.  రైతుల కోసం తాము ఎంతో చేశామని ఇప్పటికీ రుణమాఫీ కాలేదు అన్నారు. మరోవైపు రైతుల భూములను 10 లక్షలకు కొనుగోలు చేసి కోటి రూపాయలకు అమ్ముకుంటున్నారని ఆయన ముఖ్యమంత్రి కాదని తెలంగాణ రియల్ ఎస్టేట్ ఏజెంట్ గా తయారయ్యారని దుయ్యబట్టారు.  ఇంటికొక ఉద్యోగం, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, దళితులకు మూడెకరాల భూమి, పెన్షన్లు, రేషన్ కార్డులు ఇవ్వలేదని  అన్నివర్గాల ప్రజలకు అబద్దాలు చెబుతూ  సీఎం కేసీఆర్ ప్రభుత్వం ప్రజలను దగా, మోసం చేసిందని పేర్కొన్నారు. ఈ క్రమంలో రైతులు, నిరుద్యోగులు, విద్యార్థులు, పింఛను దారులు, ఉద్యోగులు రాష్ట్రంలో గోస పడుతున్నారని అన్నారు. తెరాస ప్రభుత్వ వైఫల్యాలను ఎండబగడుతూ ప్రజా గోస యాత్ర ద్వారా ప్రజా సమస్యలు తెలుసుకుంటూ వారిలో ధైర్యం నింపేందుకే బిజెపి భరోసా యాత్ర చేపడుతుందన్నారు తెలంగాణ కొరకు పోరాడిన వాళ్లంతా బిజెపిలో చేరుతున్నారని ఈ నేపద్యంలో  రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి రావడం ఖాయమన్నారు.
 
Attachments area