‘తెలంగాణ ప్రకటనను సత్వరం చేయాలని కోరాం’: టీ మంత్రులు
ఢిల్లీ: తెలంగాణ ప్రకటనను సత్వరం చేయాలని పార్టీ ముఖ్యులను కోరినట్లు తెలంగాణ మంత్రులు వెల్లడించారు. తెలంగాణ అంశంపై చర్చించేందుకు గత కొద్దిరోజులుగా ఢిల్లీ బాట పట్టిన తెలంగాణ మంత్రులు పర్యటన నేటితో ముగిసింది. ఆదివారం ఉదయం కేంద్ర హోంమంత్రి షిండేతో భేటీ అయిన మంత్రులు.. మధ్యాహ్నం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో నెలకొన్న పరిణామాలను సవివరంగా అధిష్ఠానానికి చెప్పామని వివరించారు. క్షేత్రస్థాయిలో తెలంగాణపై ప్రజల ఆకాంక్ష, అభిమతాన్ని అధిష్ఠానానికి చెప్పామని తెలియజేశారు.