తెలంగాణ ప్రభుత్వోద్యోగుల డీఏకు ఎలక్షన్ కమిషన్ బ్రేక్
హైదరాబాద్(జనంసాక్షి): తెలంగాణ ప్రభుత్వోద్యోగుల డీఏకు ఎలక్షన్ కమిషన్ బ్రేక్ వేసింది. డీఏ ప్రకటన కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు ఇది నిజంగా షాకింగ్ విషయమే. ఎన్నికల నోటిఫికేషన్‌కు మూడు నెలల ముందు ప్రభుత్వ ఉద్యోగుల డీఏపై నిర్ణయం తీసుకోవడం జరిగింది. నిర్ణయం తీసుకొని దాదాపు ఆరు నెలలు కావస్తున్నా షెడ్యూల్ వచ్చే వరకూ కేసీఆర్ సర్కార్ నిర్ణయం తీసుకోలేదు. డీఏ ప్రకటించి ప్రభుత్వం కాలయాపన చేసింది. ఆలస్యం కావడంతో ఎన్నికల నోటిఫికిషన్ వచ్చేసింది. కోడ్ ఉండటంతో డీఏ అమలు కాలేదు. దీంతో ఎన్నికల కమిషన్‌కు ప్రభుత్వం లేఖ రాసింది. అయినా ఉపయోగం లేకుండా పోయింది. నాలుగు రోజుల కిందట సీఈఓ వికాస్ రాజ్‌ను ఉద్యోగ సంఘాల నేతలు వెళ్లి కలవడం జరిగింది. డీఏపై నిర్ణయం తీసుకోకుండా సీఈ సైతం హోల్డ్‌లో పెట్టింది. మొత్తానికి బ్రేక్ పడిపోయింది.