తెలంగాణ బడ్జెట్ 2015-16

777అసెంబ్లీలో ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ 2015-16 బడ్జెట్ ప్రవేశపెట్టారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్ ఉంటుందన్న ఆయన.. తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టడం గర్వంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ తనకు అవకాశం ఇచ్చిందనకు ఈటెల కృతజ్ఞతలు తెలిపారు. ప్రతీ పైసా తెలంగాణ ప్రజల సర్వతోముఖాభివృద్ధికి కేటాయిస్తామని, బడ్జెట్ అంటే చిట్టాపద్దుల పట్టిక కాదని, జీవం లేని అంకెల కూర్పు కాదని.. సారం లేని గణాంకాలు అంతకన్నా కాదన్నారు. బడ్జెట్ తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చే బడ్జెట్ అని తెలిపారు. సంక్షేమం, వ్యవసాయం, ఉపాధి కల్పనకు ప్రాధాన్యత ఇస్తామని ఈటెల ప్రకటించారు.

తెలంగాణ బడ్జెట్ ముఖ్యాంశాలు:

• తెలంగాణ బడ్జెట్ రూ.1,15,689 కోట్లు
• ప్రణాళికా వ్యయం రూ. 52,383 కోట్లు
• ప్రణాళికేతర వ్యయం రూ. 63,306 కోట్లు
• మొత్తం రూ. 1,15,689 కోట్లు
• ఆర్థిక మిగులు రూ. 531 కోట్లు
• ద్రవ్యలోటు రూ. 16,969 కోట్లు
• జీఎస్డీపీలో ద్రవ్యలోటు 3.49 శాతం
• కేంద్రం నుంచి పన్నుల రాబడి రూ. 12,823 కోట్లు

• దళితుల భూ పంపిణీకి రూ. 1000 కోట్లు
• షెడ్యూల్డ్ కులాల సంక్షేమానికి రూ. 5547 కోట్లు
• గిరిజన సంక్షేమానికి రూ. 2878 కోట్లు
• ఎస్సీ సబ్ ప్లాన్ రూ. 8089 కోట్లు
• ఎస్టీ సబ్ ప్లాన్ రూ. 5036 కోట్లు
• బీసీ సంక్షేమానికి రూ. 2172 కోట్లు
• మైనార్టీ సంక్షేమానికి ప్రణాళికేతర వ్యయం కింద రూ.1105 కోట్లు
• ఆసరా పెన్షన్ల కోసం రూ. 4000 కోట్లు
• బీడీ కార్మికుల భృతి రూ. 188 కోట్లు

• అంగన్ వాడీ కార్యకర్తల నెల జీతం రూ. 7 వేలకు పెంపు
• అంగన్ వాడీ సహాయకులకు రూ. 4500కు పెంపు
• వంటపాత్రల కొనుగోలుకు ప్రతీ అంగన్వాడీ కేంద్రానికి రూ. 1000
• ఐసీడీఎస్ పథకానికి రూ. 771 కోట్లు
• ఆహార భద్రత, ఆహార సబ్సిడీ రూ. 2200 కోట్లు
• ఉద్యోగుల జీతభత్యాల కోసం రూ.22889 కోట్లు
• రైతు రుణమాఫీ కోసం రూ. 4250కోట్లు
• గ్రీన్ హౌస్-రూ. 250 కోట్లు
• మైక్రో ఇరిగేషన్-రూ. 200 కోట్లు
• వ్యవసాయ మార్కెటింగ్ శాఖ-రూ. 411 కోట్లు
• వ్యవసాయం, అనుబంధ రంగాలకు రూ. 8432 కోట్లు

• ముచ్చర్ల దగ్గర 11 వేల ఎకరాల్లో ఫార్మా సిటీ
• పారిశ్రామికాభివృద్ధి కోసం రూ. 973.74 కోట్లు
• 19.53 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు 7 గంటల పాటు విద్యుత్
• 1 కిలోవాట్ సామర్థ్యం గల 4వేల సోలార్ విద్యుత్ ప్లాంట్లు
• 2018 సంవత్సరానికి 23675 మె.వా విద్యుత్ ఉత్పత్తి
• విద్యుత్ రంగానికి రూ. 7400 కోట్లు
• సాగునీటి ప్రాజెక్టుల కోసం రూ. 8500 కోట్లు
• మిషన్ కాకతీయ, చిన్ననీటిపారుదల శాఖకు రూ. 2083 కోట్లు

• రోడ్లు, భవనాల శాఖ రోడ్ల అభివృద్ధికి రూ. 4980 కోట్లు
• పంచాయతీరాజ్ శాఖ రోడ్ల అభివృద్ధికి రూ. 2421 కోట్లు
• వాటర్ గ్రిడ్-రూ. 4000 కోట్లు
• 108 వాహనాల సంఖ్య 506 కు పెంపు
• వైద్య, ఆరోగ్య సేవల కోసం రూ. 4932 కోట్లు
• ఉస్మానియా యూనివర్సిటీకి రూ. 238 కోట్లు
• ఉద్యాన, పశు వైద్య, వ్యవసాయ యూనివర్సిటీల అభివృద్ధికి రూ. 261 కోట్లు
• విద్యా రంగానికి రూ. 11216 కోట్లు
• హరిత హారం-రూ. 325 కోట్లు
• జీహెచ్ఎంసీ-రూ. 526 కోట్లు
• హైదరాబాద్ మెట్రోరైలు-రూ. 416 కోట్లు
• హైదరాబాద్ వాటర్ అండ్ సీవరేజ్ బోర్డుకు రూ. 1000 కోట్లు
• యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్ మెంట్ అథారిటీకి మరో రూ. 100 కోట్లు