తెలంగాణ బిడ్డ, మాజీ ప్రధాని పీవీకి భారత రత్న
మాజీ ప్రధానమంత్రులు మాజీ ప్రధాని పి.వి. నరసింహారావు, చౌదరి చరణ్‌సింగ్‌కు అత్యున్నత పురస్కారం భారతరత్నతో గౌరవిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.మాజీ ప్రధానమంత్రులు పి.వి. నరసింహారావు, చౌదరి చరణ్‌సింగ్, MS స్వామినాథన్‌కు భారతరత్న పురస్కారాన్ని ప్రదానం చేయనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ప్రకటించారు.భారతదేశాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేయడంలో అతని దూరదృష్టి గల నాయకత్వం కీలక పాత్ర పోషించిందన్నారు. కాగా 1991 – 96 వరకు భారత ప్రధానిగా పీవీ నర్సింహారావు పనిచేశారు. 1972లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా పీవీ నర్సింహారావు సేవలందించారు. పీవీ వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లిలో జన్మించారు. పీవీతో పాటు మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్. స్వామినాథన్ కు సైతం కేంద్రం భారత రత్న ప్రకటించింది.