తెలంగాణ మార్చ్‌లో అశేషంగా పాల్గొనండి

పాలకుల మెడలు వంచండి : మావోయిస్టు పార్టీ పిలుపు
వరంగల్‌, సెప్టెంబర్‌ 27 (జనంసాక్షి) :
ఈ నెల 30న జరుగనున్న తెలంగాణ మార్చ్‌లో అశేషంగా పాల్గొని, విజయవంతం చేయాలని సీపీఐ మావో యిస్టు పార్టీ తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చింది. ఈ మేరకు మావో యిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్‌ ఓ ప్రకటనను విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్రం కోసం సాగుతున్న ఉద్యమానికి మావోయిస్టు పార్టీ మద్దతు ఎప్పుడూ ఉంటుందని ఆయన ఆ ప్రకటనలో స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తుందని ప్రజలు నమ్మడం మానేయాలని, ఉద్యమాలతోనే ప్రత్యేక రాష్ట్రం కల సాకారమవుతుందని జగన్‌ వివరించారు. నాలుగు కోట్ల మంది ప్రజలు తెలంగాణ రాష్ట్రం కావాలంటున్నా, ఇంకా ఏకాభిప్రాయం కావాలని కేంద్రం తాత్సారం చేస్తోందని ఆయన ఆరోపించారు. సోనియా, మన్మోహన్‌ సింగ్‌, చిదంబరం,షిండే, ఆజాద్‌లను ముఠాగా అభివర్ణించిన జగన్‌, ఈ ముఠాకు తెలంగాణ అంశాన్ని పరిష్కరించాలన్న చిత్తశుద్ధి లేదని విమర్శించారు. విదేశీ కంపెనీలకు దేశీయ వనరులను దోచిపెట్టడానికి ఎన్నిసార్లయినా సమావేశమయ్యే ఈ ముఠాకు తెలంగాణపై చర్చించడానికి సమయం లేదని మండిపడ్డారు. తెలంగాణ ఎక్కడుందన్న వయలార్‌ రవి, ఈ సమస్యను