తెలంగాణ రత్న అవార్డు గ్రహితకి సన్మానం

జోగులంభ గద్వాల జిల్లా(జనంసాక్షి)జులై31  తెరాస నియోజకవర్గ ఇంచార్జి బండ్ల క్రిష్ణ మోహన్ రెడ్డి.
మల్దకల్ మండలం ఉలిగేపల్లి గ్రామానికి చెందిన బుర్రకథలో మేటి అయిన ఉలిగేపల్లి విరన్నను విశాఖపట్నం అర్పిత సాహిత్య సాంస్కృతిక సాంఘిక స్వచ్ఛంద సంస్థ వారు తెలంగాణ రత్న అవార్డును ప్రకటించడంతో రాష్ట్రంలో ఇద్దరు కళాకారులకు ఇవ్వగా అందులో జోగులంబ గద్వాల జిల్లాకు చెందిన వీరన్న కావడం విశేషం .
ఈ విషయాన్ని తెలుసుకున్న గద్వాల తెరాస నియోజకవర్గ ఇంచార్జి బండ్ల క్రిష్ణ మోహన్ రెడ్డి స్థానిక క్యాంపు కార్యాలయంలో విరన్నను సన్మానించారు బుర్రకథకు ప్రాణం పోసిన కళాకారునికి అవార్డు రావడం సంతోషించదగ్గ విషయమని ,మన నడిగడ్డ కి గర్వకారణం అని కొనియాడారు.
కార్యక్రమంలో గ్రంధాలయా సంస్థ చైర్మైన్ బిఎస్.కేశవ్,జడ్పీటీసీ భాస్కర్,కౌన్సిలర్లు మహిముద్,ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు సురేష్ శెట్టి,నాయకులు విజయ్ ,గోవిందు,రామకృష్ణ,లక్ష్మి కాంతారెడ్డి, కృష్ణా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.