తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు, ఆడపిల్లలకు రక్షణ కరువు

భాగ్యనగరం మత్తు పదార్థాలకు మాదకద్రవ్యాలకు అడ్డగా మారింది

-తెరాస ప్రభుత్వంలో మర్డర్లు, మానభంగాలు, మాదకద్రవ్యాలు వాడకం విచ్చలవిడిగా పెరిగిపోయాయి

+తెలంగాణ జన సమితి రాష్ట్ర నాయకులు గిన్నారపు మురళి తారకరామారావు

మహబూబాబాద్ బ్యూరో-జూన్7(జనంసాక్షి)

తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ఆడపిల్లలకు రక్షణ కరువు అయిందని తెలంగాణ జన సమితి రాష్ట్ర నాయకులు గిన్నారపు మురళితారక రామారావు పేర్కొన్నారు. హైదరాబాదులో జరిగిన మైనర్ బాలికపై అత్యాచారంనీ నిరసిస్తూ విలేకరులతో ఆయన మాట్లాడుతూ  పోలీసులు టీఆర్ఎస్ పార్టీకి తొత్తుల్లా  మారుతున్నారని హైదరాబాద్ నడిబొడ్డులో మైనర్ బాలికపై అత్యాచారం జరిగి వారం రోజులు గడుస్తున్నా నిందితులను పూర్తిస్థాయిలో పట్టుకోకపోవడం దుర్మార్గమన్నారు. నిందితులు పోలీసు బాస్కు బంధువులని, ఎంఐఎం నాయకులు పిల్లల్ని ఆధారాలతో సహా ఎమ్మెల్యే రఘునందనరావు మీడియా ముందు ఉంచితే ఇప్పటికీ నిద్రపోతున్న పోలీస్ వ్యవస్థను ఏమని అనాలని రామారావు ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి ఇన్ని సంవత్సరాలైనా రాష్ట్రంలో మహిళలకు, ఆడపిల్లలకు రక్షణ లేకపోగా అనేక దుర్మార్గాలకు దౌర్జన్యాలకు దోపిడీలకు పాల్పడుతున్న టీఆర్ఎస్ పార్టీ నాయకుల ఆగడాలకు అడ్డూ లేకుండా పోయిందని మండిపడ్డారు, తెలంగాణ రాష్ట్రంలో పల్లెపల్లెనా మాదకద్రవ్యాలు, మత్తుపదార్థాలు, విచ్చలవిడిగా యువత జీవితాన్ని చిందరవందర చేస్తుందన్నారు, రాష్ట్ర  ముఖ్యమంత్రి  తక్షణమే హోం మంత్రిని బర్తరఫ్ చేసి ఎంఐఎం నాయకులను అరెస్టు చేసి ఆ బాలిక కుటుంబానికి న్యాయం చేయాలని తెలంగాణ జన సమితి డిమాండ్ చేస్తోందన్నారు.

Attachments area