తెలంగాణ రాష్ట్రస్థాయి 8వ అండర్_13 బ్యాడ్మింటన్ టోర్నమెంట్

సుమారు 200 మంది బాల బాలికల క్రీడాకారుల రాక
మిర్యాలగూడలో ఈనెల 19 నుంచి 23 వరకు…
క్లియోస్పోర్ట్స్ అరేనా నూతన స్టేడియం 19 న  ప్రారంభం
మిర్యాలగూడ,  జనం సాక్షి :
తెలంగాణ రాష్ట్ర స్థాయి 8 వ అండర్- 13 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో ఈ నెల 19 నుంచి 23 వరకు నిర్వహించనున్నట్లు నల్లగొండ జిల్లా  బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్  రామారావు, ప్రధాన కార్యదర్శి రంగారావు, కోశాధికారి రంగా శ్రీధర్ లు, తెలిపారు.శనివారం మిర్యాలగూడ పట్టణంలోని హౌసింగ్ బోర్డ్
క్లియోస్పోర్ట్స్ అరేనా నూతన స్టేడియంలో  ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ సబ్ జూనియర్ అండర్ – 13, బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్  2022 టోర్నమెంట్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి అండర్ -13  ప్రతిభగల క్రీడాకారులు సుమారు 150 నుంచి 200 వరకు రానున్నారని వారు పేర్కొన్నారు. ఈ క్రీడలలో పాల్గొన్న వారికి ప్రతిభాను, బట్టి అండర్ 15, అండర్ 17 లో ఆడే అవకాశం కలుగుతుందని, అదేవిధంగా జాతీయస్థాయి అండర్ -13 ఛాంపియన్ షిప్ పాల్గొనే జట్టుకు ఎంపిక అయ్యే అవకాశాలు ఉంటాయన్నారు.  తెలంగాణ రాష్ట్రంలోనే తొలిసారిగా స్టేట్ అండర్ -13 ఛాంపియన్ షిప్ పోటీలను నల్గొండ జిల్లా మిర్యాలగూడ  పట్టణంలోని నూతన స్టేడియం అరేనాలో నిర్వహించడం గొప్ప విషయం అన్నారు. పోటీలు ఈనెల 19 నుంచి 23 వరకు జరగనుండగా, ఈనెల 19, 20 తేదీలలో క్వాలిఫైయింగ్ మ్యాచులు జరుగుతాయన్నారు. రాష్ట్రంలోని 15 జిల్లాల నుంచి ప్రతిభా గల క్రీడాకారులు ఆయా జిల్లాల బ్యాట్మెంటన్ అసోసియేషన్ కమిటీ ఎంపిక చేసిన జట్లు రానుందన్నారు ప్రతి జిల్లా నుంచి నలుగురు బాలురు, నలుగురు బాలికలు క్రీడాకారులు పోటీలలో తప్పనిసరిగా పాల్గొంటారని వారు వివరించారు. క్రీడాకారులతో పాటు క్రీడాకారుల తల్లిదండ్రులు వారందరికీ వసతి, భోజన సౌకర్యాలను క్రీడల నిర్వహణను జిల్లా బ్యాట్మెంటన్ అసోసియేషన్ నూతన కోశాధికారి రంగా శ్రీధర్ సారథ్యంలో ఇంత పెద్ద టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు వారు తెలియజేశారు. సుమారు పది లక్షల గల బడ్జెట్ ఈ పోటీల నిర్వహిస్తున్నామని, రాష్ట్ర ప్రభుత్వం క్రీడల శాఖ నుంచి సుమారు 1.5 లక్షల రూపాయలు, మిగిలినవి రంగ శ్రీధర్, స్పాన్సర్ షిప్, చేస్తున్నారని తెలిపారు. బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ ప్రారంభించేందుకు ప్రపంచ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్ వచ్చే అవకాశము ఉందని అందుకు జిల్లా అధ్యక్షులు డాక్టర్ రామారావు ప్రయత్నిస్తున్నారని  తెలిపారు. ఈ సమావేశంలో డాక్టర్ అంజయ్య, సీనియర్ క్రీడాకారులు, మెంబర్ నాగేశ్వరరావు, కోచ్ రామకృష్ణ, పిడి వెంకటేశ్వర్లు యాదవ్, ప్రముఖ రైస్ మిల్లర్ రేపాల లక్ష్మీకాంతం, తదితరులు పాల్గొన్నారు.
క్రీడాకారులకు అందుబాటులోకి నూతన స్టేడియం “అరేనా”
మిర్యాలగూడ పట్టణ, పరిసర పరిసర ప్రాంతాల క్రీడాకారులకు శుభవార్త మిర్యాలగూడ పట్టణ కేంద్రం హౌసింగ్ బోర్డ్ బిఎల్ఆర్
ఇంటి సమీపంలో నూతనంగా క్లియోస్పోర్ట్స్ అరేనా బ్యాట్మెంటన్ ఛాంపియన్షిప్ అండర్ -13 టోర్నమెంట్ నుంచి ప్రారంభించనున్నట్లు నిర్వాహకులు నేతి రాహుల్, ఏచూరి శ్రీ హర్ష  విలేకరులకు తెలియజేశారు. నూతన స్టేడియంలో ఇండోర్ బ్యాట్మెంటన్ స్టేడియం అవుట్ డోర్ క్రికెట్, కబడ్డీ,తోపాటు సిమ్మింగ్ పూల్  కూడా ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. అధునాతన హంగులతో క్రీడాకారులకు శిక్షణ ఇచ్చే విధంగా అన్ని సౌకర్యాలతో స్టేడియం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని క్రీడాకారుల కోసం ఈ విధమైన అన్ని సౌకర్యాలతో చేయడం స్టేడియం ఏర్పాటు చేయడం ప్రప్రదం అని వారు తెలిపారు క్రీడాకారులు ఈ సౌకర్యాలని వినియోగించుకోవాలని వారు తెలియజేశారు.