‘తెలంగాణ రాష్ట్రోదయం’ ఆవిష్కరణ
– ప్రోఫెసర్ కోదండరాం పుస్తక రచన
హైదరాబాద్,నవంబర్4(జనంసాక్షి):
తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన పొలిటికల్ జేఏసీ ఛైర్మన్, ప్రొఫెసర్ కోదండరాం రచించిన..తెలంగాణ రాష్ట్రోదయం పుస్తక ఆవిష్కరణ హైదరాబాద్ సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో జరిగింది. ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య, సీనియర్ పాత్రికేయులు మల్లేపల్లి లక్ష్మయ్యతో పాటు పలువురు ప్రముఖులు పుస్తకాన్ని ఆవిష్కరించారు. తెలంగాణ ఆవిర్భావంలో ప్రొఫెసర్ కోదండరాం పాత్ర గణనీయమైనదని వక్తలు కొనియాడారు. అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాంసంఘాలు, ఉద్యోగ సంఘాలను ఏకం చేసి ఉద్యమాన్ని ఉధృతం చేశారని ప్రశంసించారు. తెలంగాణ రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని, ప్రత్యేక రాష్ట్ర ఆవశ్యకతను వివరిస్తూ తాను రాసిన ఎన్నో వ్యాసాలు పుస్తకంలో పొందుపర్చామని కోదండరాం అన్నారు. తెలంగాణ జరిగిన, జరుగుతున్న అన్యాయాలను ఇందులో పొందుపరిచానని అన్నారు. ఇంకా తెలంగాణకు పూర్తి న్యాయం జరగాల్సి ఉందన్నారు.