తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సీఎం కేసీఆర్ ఆదేశాలను పట్టించుకోని ప్రవేట్ స్కూల్ యజమానులు -జిల్లాలో ప్రవేట్ స్కూల్ యజమనులదే పెత్తనం. -విద్యాశాఖ అధికారులు ఇక్కడ నిమిత్తమాత్రులు. -ఇక్కడ విద్యాశాఖ మంత్రి ఆదేశాలు పాటించరు. -ప్రవేట్ స్కూల్ యజమానులు ఏది చెప్తే ఇక్కడ అదే అమలు అవుతుంది.

గద్వాల నడిగడ్డ, జులై 20 (జనం సాక్షి);

వర్షాకాలం దృష్టిలో ఉంచుకొని
తెలంగాణలో గురు,శుక్రవారం విద్యాసంస్థలకు సెలవు అని ప్రకటించిన జోగులాంబ గద్వాల జిల్లాలో ప్రైవేటు స్కూల్ యజమానులు విద్యాసంస్థలను నడుపుతున్న విద్యాశాఖ జిల్లా అధికారులు కానీ, జిల్లా జాయింట్ కలెక్టర్ గాని వీరి వైపు కన్నెత్తి చూడరనీ ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకులు కొంకల భీమన్న అన్నారు.
జిల్లాలోని వడ్డేపల్లి మండలము
శాంతినగర్, వెంకటాపూర్ లో విద్యాశాఖ మంత్రి ఆదేశాలు వర్తించవ అని, తెలంగాణలో భారీ వర్షాల నేపథ్యంలో విద్యాసంస్థలకు రెండు రోజుల పాటు ప్రభుత్వం సెలవును ప్రకటించిందనీ,సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సెలవులు ప్రకటించినట్టు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించిన కానీ సెలవు ఆదేశాలను పట్టించుకోని ప్రవేట్ పాఠశాలల యాజమాన్యం వర్షాల కారణంగా విద్యార్థులకు ఏదైనా ప్రమాదం జరిగితే దానికి బాధ్యులు ఎవరు అని, ప్రభుత్వ అధికారుల, ప్రైవేటు స్కూళ్ల యజమానుల తేల్చి చెప్పాలని, ఏదైనా దురదృష్టవశాత్తు ప్రమాదం జరిగినప్పుడు హడావుడి చేసే ప్రభుత్వ యంత్రాంగం కనీసం ఇలాంటప్పుడైనా స్పందించాలని జోగులాంబ జిల్లాలో ప్రైవేటు యజమానులు ఒక సంఘంగా ఏర్పడి వారు చెప్పేదే ప్రభుత్వ అధికారులు వినాలని వారు అధికారులపై హుకుం జారీ చేస్తారని ఇప్పటికైనా సంబంధిత అధికారులు జిల్లా కలెక్టర్ స్పందించి ప్రైవేటు స్కూల్ యజమానులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని లేదంటే తాము గ్రామ, మండల,జిల్లా, రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకులు కొంకల భీమన్న అన్నారు.