**తెలంగాణ రాష్ట్ర వైఎస్సార్ పార్టీ షర్మిల రాకతో

పాదయాత్ర లో…..ప్రజల ప్రస్తావన*

గద్వాల ఆర్ సి,(జనం సాక్షి) ఆగస్ట్ 22.
గద్వాల జిల్లాలో నీ తెలంగాణ రాష్ట్ర వై ఎస్సార్ పార్టీ అధినేత్రి షర్మిల పాదయాత్ర గద్వాల్ నియోజక వర్గం ధరూర్ మండలం చిన్న చింత రేవుల గ్రామస్థులతో వైఎస్ షర్మిల మాట్లాడుతూ వై ఎస్సార్ హయాంలో ప్రతి పథకం అద్భుతంగా అమలు చేసి చూపించారని,వ్యవసాయం పండుగలా ఉండేదని పెట్టుబడి తగ్గించి రాబడి పెంచారని అన్నారు.ఉచిత విద్యుత్ ఆలోచన చేసిన మొట్ట మొదటి నాయకుడు వైఎస్సార్ అని అన్నారు.చంద్రబాబు కరెంట్ తీగల మీద బట్టలు ఆరేసుకోవాలి అని ఎగతాళి చేసినా ఉచిత కరెంట్ ఇచ్చిన
ఘనత వై ఎస్సార్ అని అన్నారు.మైనారిటీ లకు ఫీజు రీయింబర్స్మెంట్,అరోగ్యశ్రీ పథకం ఇలా ప్రతి పథకం ప్రత్యేకమై అమలు చేశారు. వైఎస్సార్ 5 ఏళ్ల పరిపాలన లో 46 లక్షల మంది పేదలకు పక్కా ఇళ్ళు కట్టి, మైనారిటీలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత వైఎస్సార్ ది మాత్రమే అని అన్నారు.వైఎస్సార్ పాలన లో చార్జీలు పెరగలేదని ఒక్క రూపాయి పన్నులు మోపకుండా జలయజ్ఞం లాంటి పథకాలు అమలు చేసి చూపించారని.నెట్టెంపాడు ప్రాజెక్ట్ కట్టి వైఎస్సార్ లక్షల ఎకరాలకు నీళ్ళు పారించారని అన్నారు.30 వేలు ఎకరాలు లబ్ది చేకూరే పథకాలను బంద్ పెట్టీ ముష్టి ఐదు వేలు రైతు బందు లో పంట నష్టం జరిగితే పరిహారం ఇచ్చే పరిస్థితి కూడా లేదు .ఉద్యోగాలు లేక వందల మంది నిరుద్యోగులు చనిపోతున్నారు.రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే ఇప్పటి వరకు17 వేలకు మాత్రమే నోటిఫికేషన్లు ఇచ్చారు.బంగారం లాంటి రాష్ట్రాన్ని కేసీఅర్ చేతుల్లో పెడితే 4 లక్షల కోట్ల అప్పుల రాష్ట్రం గా మార్చారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద పెట్టీ మొత్తం కమీషన్లు కాజేషారు
మాట మీద నిలబడని కేసీఅర్ ను ముఖ్యమంత్రి అనొద్దు మోసగాడు అనాలి అని ధ్వజం ఎత్తారు. ప్రజల సంక్షేమం అంటే కేసీఅర్ కు తెలియదు అని ప్రజల మెలుకోవలని తెలిపారు.