తెలంగాణ రాష్ట్ర స్థాయి బాల కళా ఉత్సవం-2022 పోటీల కరపత్రాలను విడుదల.

బెల్లంపల్లి, నవంబర్ 19, (జనంసాక్షి )
బెల్లంపల్లి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తెలంగాణ రాష్ట్ర స్థాయి బాల కళా ఉత్సవం 2022 పోటీల కరపత్రాలను విడుదల చేశారు.
తెలంగాణ రాష్ట్ర భాష మరియు సాంస్కృతిక శాఖ సౌజన్యం తో టాలెంట్ డాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో
నవంబర్ 30 బుధవారం నాడు బెల్లంపల్లి పట్టణంలోని సింగరేణి కళావేదిక లో బాల కళా ఉత్సవ్-2022, జరుగనున్నాయని,
ఈ కార్యక్రమాలను పాఠశాల యాజమాన్యాలు,విద్యార్థులు, కళాకారులు, విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులలో ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఈ పోటీలు ఎంతగానో దోహదం చేస్తాయన్నారు. ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. అనంతరం
టాలెంట్ డాన్స్ అకాడమీ సంస్థ వ్యవస్థాపకులు,గ్రాండ్ మాస్టర్ జూపాక గోపి, ప్రోగ్రాం నిర్వాహకుడు డాన్స్ మాస్టర్ సునార్కర్ రాంబాబు మాట్లాడుతూ చిన్నపిల్లలకు ఫ్యాన్సీ డ్రెస్, సినిమా, క్లాసికల్, జానపదం, కోలాటం పోటీలు నిర్వహిస్తున్నామని, సోలో, గ్రూప్, డ్యూయెట్ విభాగాలు ఉంటాయని తెలిపారు. 30 వ తేదీన బుధవారం ఉదయం 10 గంటలకు బెల్లంపల్లి సింగరేణి కళా వేదికలో పోటీలు జరుగుతాయని, అదే రోజు రాత్రి 7 గంటలకు రాజకీయ ,సిని, ప్రముఖుల చేతుల మీదుగా బహుమతి ప్రధానోత్సవం జరుగుతుందని వివరించారు. వివరాలకై 9908967967 నెంబర్ కి సంప్రదించాలన్నారు. ఈకార్యక్రమంలో ఎంపీపీ గోమాస శ్రీనివాస్,
బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్
ప్రెసిడెంట్ నూనెటి సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి రెవెల్లి విజయ్,
యూత్ ప్రధాన కార్యదర్శి శ్యామ్, సీనియర్ నాయకులు భీమ గౌడ్, సాన శ్రావణ్, సీనియర్ మాస్టర్ ఆడిచర్ల రాజు, ప్రోగ్రాం ఇంచార్జ్ గడ్డం రమణ, గాజనమేన శ్యామ్,
ఆర్గనైజింగ్ మహ్మద్ అలీభాయ్, రాజేష్, వేణు రవితేజ, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.