తెలంగాణ రెండేళ్ల పసిబిడ్డ: ప్రధాని మోదీ
మెదక్: తెలంగాణ రెండేళ్ల పసిబిడ్డని ఇంత తక్కువ కాలంలో అభివృద్ధి దిశగా అడుగులేస్తోందని ప్రధాని మోదీ అన్నారు. కేంద్రం, తెలంగాణ మధ్య సంబంధాలు బాగున్నాయని, కేసీఆర్ నన్నెప్పుడు కలిసినా తెలంగాణ అభివృద్ధినే ప్రస్తావించారని ఆయన చెప్పారు. గజ్వేల్‌లో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. ప్రధాని మోదీ తెలుగులో తన ప్రసంగాన్ని ప్రారంభించారు. కెసీఆర్ మిషన్ భగీరథ గురించి తనకు చెప్పారన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలిసారి ఇక్కడికి రావడం సంతోషంగా ఉందని, ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు ప్రధాని శుభకాంక్షలు తెలిపారు. కేంద్ర, రాష్ట్రాల సహకారంతోనే అభివృద్ధి సాధ్యమని, జీఎస్టీకి మద్దతిచ్చినందుకు కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. పంచభూతాల్లాంటి ఐదు ప్రాజెక్టులను ఇవాళ ప్రారంభించానని మోదీ చెప్పారు.