తెలంగాణ లో వచ్చేది బిజెపి సర్కారే – ప్రవాసి ఎమ్మెల్యే సుశాంత్ జనంసాక్షి , కమాన్ పూర్ :

ప్రవాసి ఎమ్మెల్యే సంపర్క్ అభియాన్ కార్యక్రమం లో భాగంగా అస్సాం ఎమ్మెల్యే సుశాంత్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి ఆదివారహ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి అనంతరం కమాన్ పూర్ మండల కేంద్రం లోని పార్టీ ఆఫీస్ లో ముఖ్య నాయకుల సమావేశం లో పాల్గొన్నారు. అనంతరం సుశాంత్ మాట్లాడుతూ… మంథని ప్రాంతం నుండి ఒక ప్రధానిగా పని చేసిన ప్రాంతం ఇంకా అభివృద్ధి చెందక పోవడం దురదృష్టకరం, మంథనిలో బీజేపీ సునీల్ రెడ్డి రాక ముందు చాల వీక్ గా ఉండేది కాని సునిల్ రెడ్డి చాల కష్టపడి పని చేసి ఈరోజు ప్రజల్లో బీజేపీ పార్టీ ని ఇంత బలంగా తీసుకొని వెళ్ళుతున్నారు అని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కోసం తన ఉన్నత ఉద్యోగని వదులుకొని పోరాడితే గుర్తింపు ఇవ్వకుండా మోసం చేశారు, ఉద్యమ కారులకు బీజేపీ పార్టీలో మంచి గుర్తింపు ఉంటుంది, అస్సాం లో కూడా కేవలం 3 ముగ్గురు ఎమ్మెల్యే లు ఉండేవారు కార్యకర్తల కష్టం ప్రధాని నరేంద్ర మోదీ పాలన వలన అధికారం లోకి రావడం జరిగింది అని అన్నారు. ఒక మంచి వ్యక్తి సునీల్ కి గెలుపు కొరకు కష్టపడి పనిచేయండి, కార్యకర్తలకు సముచిత స్థానం ఉంటుందన్నారు. మోదీ అవాస్ యోజన, ఆయుష్మాన్ భారత్ లాంటి పేదవారికి ఇచ్చే పథకలు కెసిఆర్ ప్రభుత్వం ప్రజలకు అందకుండా చేస్తుంది.. కేంద్ర ప్రభుత్వ పథకాలు మరింతగా ప్రజలోకి తీసుకెళ్లే బాధ్యత మనదే అన్నారు. కమాన్ పూర్ మండల అధ్యక్షులు జంగ పల్లి అజయ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మంథని నియోజకవర్గ కన్వీనర్ మల్క మోహన్ రావు, మంథని నియోజకవర్గ కో కన్వీనర్ నాంపల్లి రమేష్, సీనియర్ నాయకులు మట్ట శంకర్, మచ్చ గిరి రాము,మండల ప్రధాన కార్యదర్శులు కొయ్యడ సతీష్, మళ్లారపు అరుణ్ కుమార్, బర్ల సదా నందం, మంథని నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ తొట్ల రాజు, ఉపాధ్యక్షులు దండే రమేష్,మట్ట రాజయ్య, సాగంటి లక్ష్మణ్ స్వామి,యువ మోర్చ అధ్యక్షులు పతకని విశ్వ తేజ, మహిళా మోర్చ్ అద్యక్షు రాలు అలుగు కృష్ణవేణి, దళిత మోర్చ అధ్యక్షులు సుద్దాల కృష్ణ మూర్తి, బిసి మోర్చ అధ్యక్షులు అర్కాటి ఓంకార్, మట్ట మల్లేష్,రామస్వామి, కొమ్ము శ్రీనివాస్, గట్టు శ్రీనివాస్, పాల కూర్తి నాయకులు తోగరి తిరుపతి, కంకటి శ్రీనివాస్, బొబ్బిలి, మల్క సురేందర్ అన్ని శక్తి కేంద్ర ఇంచార్జ్ లు,అన్ని బూత్ అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.