తెలంగాణ వాదులదే నైతిక విజయం

హైదరాబాద్‌,(జనంసాక్షి): పోలీసుల్ని మోహరింపచేసి ఎన్ని అడ్డంకులు సృష్టించినా తెలంగాణ వాదులదే నైతిక విజయమని తెలంగాణ పొలిటికల్‌ జేఏసీ ప్రొఫేసర్‌ కోదండరామ్‌ అన్నారు. చలో అసెంబ్లీకి బయల్ధేరిన ఆయనను పోలీసులు అశోక్‌ నగర్‌ వద్ద అరెస్టు చేశారు. ఈ సందర్భంగా కోదండరామ్‌ మాట్లాడుతూ చలో అసెంబ్లీకి అనుమతి ఇవ్వకుండా ప్రభుత్వం సాధించిందేమీ లేదన్నారు.
ప్రజాస్వామ్యాన్ని ప్రభుత్వం ఖూనీ చేసిందని ఆయన మండిపడ్డారు. ఎన్ని అడ్డంకులు సృష్టించిన నిరసనలు కొనసాగుతాయన్నారు. శనివారం భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తామని కోదండరామ్‌ తెలిపారు. కోదండరామ్‌తో పాటు శ్రీనివాష్‌ గౌడ్‌ సహా పలువురు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.