తెలంగాణ వాదుల అరెస్టుపై హెచ్‌ఆర్సీని ఆశ్రయిస్తా: హరీష్‌రావు
హైదరాబాద్,(జనంసాక్షి): ఛలో అసెంబ్లీ నేపథాన్ని పురస్కరించుకొని పలువురు టీఆర్‌ఎస్ కార్యకర్తలు , తెలంగాణవాదులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేయడం పట్ల టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే టి. హరీష్‌రావు గురువారం హైదరాబాద్ గురువారం హైదరాబాద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ వాదుల అరెస్టులపై మానవహక్కుల సంఘాన్ని (హెచ్‌ఆర్పీ) ఆశ్రయిస్తామని ఆయన వెల్లడించారు. అందుకోసం హెస్‌ఆర్సీలో పిటిషన్ వేయనునన్నట్లు హరీష్‌రావు తెలిపారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణ ఐకాస శుక్రవారం ‘ఛలో అసెంబ్లీకి పిలుపునిచ్చింది. అయితే ప్రభుత్వం ఛలో అసెంబ్లీ అనుమతికి ఇచ్చేందకు నిరాకరించింది. ఈ నేపథ్యంలో ముందస్తుగానే తెలంగాణ వాదులను పోలీసులు అరెస్టు చేస్తున్నారు.