తెలంగాణ విత్తన భాండాగారమే సిఎం కెసిఆర్‌ లక్ష్యం

 

సిద్దిపేట,ఆగస్ట్‌30:తెలంగాణ రాష్టాన్న్రి విత్తన బంఢాగారంగా మార్చాలనే ఉద్దేశంతో సాగులో అనేక విప్లవాత్మకమైన మార్పులు తీసుకరావడం జరిగిందని దుబ్బాక ఎమ్మెల్యే రామలింగా రెడ్డి అన్నారు. అప్పుల ఊబిలో చిక్కుకున్న రైతాంగాన్ని ఆదుకునేందకు గాను సుమారు రూ17వేల కోట్ల రుణమాఫీ చేయడం జరిగింది. తక్కువ నీటి వనరులతో ఎక్కువ సాగు జరగాలనే ఉద్దేశంతో సూక్ష్మనీటి పథకానికి 100 శాతం రాయితీ ఇచ్చిన ఘనత తెలంగాణ సర్కార్‌కే దక్కిందన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రతి మండలానికి ఒక సైంటిఫిక్‌ గోడౌన్‌ నిర్మాణం చేపట్టడం, సాగుకు సాంకేతిక పరిజ్ణానాన్ని దరికి చేర్చడంతో ఆశించిన ఫలితాలను అన్నదాతలు పొందుతున్నారని అన్నారు. చరిత్రలో ఉన్నడూ లేని విధంగా ప్రతి ఐదువేల ఎకరాలకు ఒక ఏఈఓను సైతం నియమించడం జరిగిందన్నారు. వ్యవసాయశాఖలో రైతుల వివరాలు సమగ్రా ఉండాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం రైతు సమగ్ర సర్వే చేపట్టిందని అన్నారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు జిల్లా వ్యవసాయశాఖ, ఉద్యా నశాఖ అధికారులు సంయుక్తంగా సర్వే చేయడం జరిగింది. ఈ సంవత్సరం ఖరీఫ్‌ సీజన్‌కు ముందు అధికారులు సుమారు 45 రోజుల పాటు శ్రమించి పూర్తి వివరాలను సేకరించడం జరిగింది. రైతు వివరాలు పక్కాగా ఉండాలనే ఉద్దేశంతో టీ సర్కార్‌ ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఒక వైపు సాగు చేస్తున్న రైతుల వివరాలతో పాటు సదరు రైతు ఎలాంటి పంటలు వేస్తున్నారు, భూసార పరీ క్షల ఫలితాలు ఏవిధంగా ఉన్నాయి, ఎంత మ్తొతంలో సాగు చేయడం జరుగతుంది. ఎలాంటి రసాయనిక మందులను వాడుతున్నారు అనే విషయాలపై సర్వే చేయడం జరిగింది. దాదాపు 21 అంశాలతో కూడిన సర్వేను పూర్తి చేసిన అధికారులు ప్రస్తుతం ఆ సమాచారంను ఆన్‌లైన్‌లో పొందుపరుస్తున్నారని వివరించారు. ప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతాం గాన్ని ఆదుకునేందుకు గాను సీఎం కేసీఆర్‌ ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకోని చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడం జరిగింది. వచ్చే ఏడాది నుంచి ప్రతి రైతుకు ఎకరానికి రూ. 8 వేల చొప్పున పెట్టుబడి సొమ్మును అందివ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఒక్కొ సీజన్‌కు రూ. 4 వేల చొప్పున రైతు ఖాతాలోకి అందజేసేందుకు అధికారులు కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఓ పక్క సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణ పనులు యుద్ధప్రాతిపదికన చేపడుతూనే మరోవైపు రైతు అభివృద్ధే ధ్యేయంగా అనేక సంస్కరణలు తీసు కొస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీరు పట్ల సబ్బండ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయని అన్నారు. తెలంగాణ రాష్టాన్న్రి విత్తన బంఢాగారంగా తయారు చేయాలనే సీఎం కేసీఆర్‌ ఆకాంక్షకు అనుగుణంగా జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు రైతులకు తగు సలహాలు, సూచనలు చేస్తున్నారని అన్నారు. మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు నిర్మాణం కోసం మెదక్‌లో నిర్వహించిన ప్రజాభిప్రాయసేకరణకు వంద శాతం మద్దతు తెలిపారని పేర్కొన్నారు. ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే చెరువులు, కుంటలు కళకళలాడుతాయని అన్నారు. ప్రతిపక్షాలు లేనిపోని ఆరోపణలు చేయడం మానుకోవాలన్నారు. భూసర్వేతో సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలతో పాటు రెవెన్యూ కార్యాలయంలో లంచాలకు తావులేకుండా తహసీల్దార్‌ కార్యాలయంలో 15 నిమిషాల్లోనే సమస్యలు పరిష్కారం కానున్నాయన్నారు.