తెలంగాణ వ్యాప్తంగా మళ్లీ వర్షాలు

జంటనగరాల్లో అర్థరాత్రి వర్షబీభత్సం
పొంగిపొర్లుతున్న డ్రైనేజీలు..నీటమునిగిన పలు కాలనీలు
జంట జలాశయాలతో పాటు హుస్సేన్‌ సాగర్‌కు వరద
రాష్ట్రంలో ప్రాజెక్టులకు పెరిగిన వరదపోటు
శ్రీరాంసాగర్‌,కాళేశ్వరం, సాగర్‌ జలాశయాలకు వరదప్రవాహం

హైదరాబాద్‌,జూలై26(జనంసాక్షి): రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో సోమవారం అర్ధరాత్రి తర్వాత భారీ వర్షం కురిసింది. పలుప్రాజెక్టుల్లోకి మళ్లీ వరద పెరిగింది. గోదావరి పరివాహకం ప్రాంతాల్లో వరద పెరుగుతోంది. వికారాబాద్‌, సంగారెడ్డి, నిజామాబాద్‌, రంగారెడ్డి, హన్మకొండ, సిద్ధిపేట జిల్లాల్లోతో పాటు జీహెచ్‌ఎంసీ పరిధిలో భారీ వర్షం కురిసింది. అత్యధికంగా వికారాబాద్‌లో 13 సెంటీవిూటర్ల వర్షాపాతం నమోదైంది. మద్గుల్‌ చిట్టెంపల్లిలో 12.4 సెంటీవిూటర్ల వర్షం కురిసింది. సర్పన్‌పల్లి ప్రాజెక్టు జలకళను సంతరించుకున్నది. భారీ వర్షాలకు వాగులు వంకలు ఉప్పొంగుతున్నాయి. తాండూరుకు రాకపోకలు నిలిచిపోయాయి. పలు జిల్లాల్లో ఆయా ప్రాంతాల్లో ఎనిమిది సెంటీవిూటర్లకుపైగా వర్షాపాతం నమోదైంది. గోదావరికి మరోమారు వరద ప్రవాహం పెరిగింది. నిర్మల్‌ జిల్లా బాసరలో రైల్వేస్టేషన్‌ ప్రాంతంలో వర్షాలకు నీరంతా నిలిచి పోయింది. గోదావరిలో వరద ఉధృతి పెరిగింది. మహబూబాబాద్‌ అర్పనపల్లి వద్ద వట్టివాగు పొంగి ప్రవహిస్తున్నది. కేసముద్రం` గూడూరు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.హైదరాబాద్‌ జంట నగరాల పరిధిలోని వర్షం దంచికొట్టింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సరూర్‌నగర్‌, కోదండరాం నగర్‌ లోతట్టు ప్రాంతాల్లో ఇండ్లలోకి నీరు చేరింది. సూరారం తెలుగుతల్లి నగర్‌లో మోకాళ్లలోతు నీరు నిలిచింది. జీహెచ్‌ఎంసీ అధికారులు, సిబ్బంది ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తూ నీటిని తొలగించేందుకు చర్యలు చేపట్టారు. నగర పరిధిలోని శేరిలింగంపల్లిలో 7.4, మెహదీపట్నంలో 6.7, నాంపల్లిలో 8, నారాయణగూడలో 8.5, చార్మినార్‌లో 8.5, ఎల్బీనగర్‌ సంతోష్‌నగర్‌లో 7.7, సరూర్‌నగర్‌ 6.4 సెంటీవిూటర్ల వర్షాపాతం నమోదైంది. వర్షానికి హుస్సేన్‌సాగర్‌ వరద పెరిగింది. పూర్తిస్థాయి నీటిమట్టం దాటిపోయింది. ప్రస్తుతం నీటిమట్టం 513.45 విూటర్లు ఉన్నది. పూర్తిస్థాయినీటిమట్టం 513.41 విూటర్లు. మరో వైపు జంట జలాశయాలకు భారీగా వరద నీరు పోటెత్తుతున్నది. ఉస్మాన్‌సాగర్‌ నుంచి మూసీలోకి 1,278 క్యూసెక్కుల వరదను అధికారులు విడుదల చేశారు. ఉస్మాన్‌సాగర్‌కు ఇన్‌ª`ª`లో 1200 క్యూసెక్కుల ఉండగా.. ప్రస్తుతం నీటిమట్టం 1778 అడుగులున్నది. హిమాయత్‌సాగర్‌ జలాశయానికి ఇన్‌ప్లో 325 క్యూసెక్కులు ఉండగా.. మూసీలోకి 330 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం 1,760.70 అడుగుల నీరున్నది.
భాగ్యనగరాన్ని అర్ధరాత్రి వర్షం ముంచెత్తింది. నగరవ్యాప్తంగా పలుచోట్ల భారీ వర్షం కురిసింది. యాకుత్‌పురా, మల్లేపల్లిలో వర్షానికి వాహనాలు కొట్టుకుపోయాయి. బేగంబజార్‌లోని ఇళ్లు, షాపుల్లోకి వర్షపు నీరు వచ్చి చేరింది. రోడ్లపై మోకాలిలోతు నీటిలో వాహనాలు ఉండిపోయాయి. పలు చోట్ల సామాగ్రి, నిత్యావసర వస్తువులు నీట మునిగాయి. వరద ప్రవాహంలో పలుచోట్ల కార్లు, బైకులు కొట్టుకుపోయాయి. మూసారాం బాగ్‌ వంతెన పైనుంచి వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో మూసారాంబాగ్‌ నుంచి గోల్నాక వైపు రాకపోకలు నిలిచిపోయాయి. మలక్‌పేట వంతెన కింద భారీగా వరద నీరు నిలిచిపోయింది. హయత్‌నగర్‌ 9.2 సెంటీవిూటర్లు, హస్తినాపురం సౌత్‌లో 8.8 సెంటీవిూటర్లు, అంబర్‌పేటలో 8.2 సెంటీవిూటర్లు సైదాబాద్‌లో 8.0 సెంటీవిూటర్లు, బహదూర్‌పూరాలో 7.8 సెంటీవిూటర్లు, చార్మినార్‌లో 7.5 సెంటీవిూటర్ల వర్షపాతం
నమోదు అయ్యింది. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీరామ్‌ సాగర్‌ ప్రాజెక్ట్‌ లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్ట్‌ ఇన్‌ప్లో 60,820 క్యూసెక్కులుగా ఉంది. దీంతో అధికారులు 18 గేట్లు ఎత్తి 49,968 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు, 90 టీఎంసీలు, ప్రస్తుతం 1087.6 అడుగులు, 75.145 టీఎంసీలుగా కొనసాగుతోంది. కాళేశ్వరం పుష్కరఘాట్‌ వద్ద గోదావరి 10.680 విూటర్ల ఎత్తులో ప్రవహిస్తోంది. లక్ష్మీ (మేడిగడ్డ) బ్యారేజీలోని మొత్తం 85 గేట్లు ఎత్తి అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇన్‌ ఎª`లో, ఔట్‌ ఎª`లో 6,99,890 క్యూసెక్కులుగా ఉంది. అటు సరస్వతి (అన్నారం) బ్యారేజీలోని మొత్తం 66 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ఇన్‌ ఎª`లో, ఔట్‌ ఎª`లో 1,81,627 క్యూసెక్కులుగా కొనసాగుతోంది. బ్యారేజీ పూర్తి సామర్థ్యం 0.410 టీఎంసీలకు గాను ప్రస్తుత నీటి మట్టం 0.29 టీఎంసీలకు చేరింది.
నాగార్జున సాగర్‌ జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతున్నది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి ఇన్‌ప్లో 57,669గా ఉన్నది. విద్యుత్‌ ఉత్పత్తికి 5,378 క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయంలో 544.50 అడుగుల నీరుండగా.. పూర్తిస్థాయినీటిమట్టం 590 అడుగులు. సాగర్‌ డ్యామ్‌ గరిష్ఠస్థాయి 312.04 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 201.13 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. మరో వైపు ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద తగ్గుముఖంపడుతున్నది. ప్రస్తుతం ప్రాజెక్టుకు 37,384క్యూసెక్కుల వరద వస్తున్నది. ప్రస్తుతం డ్యామ్‌ నుంచి అవుట్‌ ప్లో 69,317 క్యూసెక్కులుగా ఉన్నది. పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 881.10 అడుగులు ఉన్నది. గరిష్ఠ నీటి నిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలు కాగా.. 19.8593టీఎంసీలు నిల్వ ఉన్నది. కుడి, ఎడమగట్లలో ఉన్న జల విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాల్లో కరెంటు ఉత్పత్తి కొనసాగుతున్నది.