తెలంగాణ శాసనసభాపతి అభ్యర్థిగా పోచారం
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఎవరు అన్నదానిపై సస్పెన్స్ వీడింది. సీనియర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి తెలంగాణ రెండో శాసనసభకు స్పీకర్‌గా వ్యవహరించనున్నారు. రేసులో పద్మాదేవెందర్ రెడ్డి, ఈటల రాజేందర్, రెడ్యా నాయక్ పేర్లు వినిపించినప్పటికీ చివరికి పోచారం వైపే కేసీఆర్ మొగ్గుచూపారు. దీంతో పోచారం అసెంబ్లీ కార్యదర్శికి నామినేషన్ పత్రాలు అందజేశారు. పోచారంను స్పీకర్‌గా ప్రతిపాదిస్తూ కేసీఆర్ తొలి సంతకం చేశారు. పోచారం అభ్యర్ధిత్వాన్ని బలపరుస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క, ఎంఐఎం ఎమ్మెల్యేలు బలపరుస్తూ సంతకాలు చేశారు. స్పీకర్ ఎన్నికకు షెడ్యూల్ విడుదలకాగానే పోచారం నామినేషన్ దాఖలు చేశారు. ఆయన ఎన్నిక ఏకగ్రీవం కానుంది.