తెలంగాణ సాధన కోసం అన్ని శక్తులు ఏకం చేస్తాం : కోదండరాం
హైదరాబాద్: అమరుల త్యాగాలను దృష్టిలో పెట్టుకొని ఈ నెల 28 లోగా కేంద్రంతెలంగాణ రాష్ట్రం ప్రకటించాలని తెలంగాదణ రాజకీయ ఐకాస ఛైర్మెన్ కోదండరాం డిమాండ్ చేశారు. ఈ ఉదయం కాంగ్రెస్ సీనియర్ నేత కేకే, మంత్రి జానారెడ్డితో ఆయన భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తెలంగాణ సాధన కోసం అన్ని శక్తులను ఏకం చేసి పోరాటం కొన సాగిస్తామని తెలిపారు. తెలంగాణపై అనుకూల నిర్ణయం తీసుకోకపోతే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.