తెలంగాణ సాధన కోసం దేనికైనా రెడీ : మంత్రి బసవరాజు సారయ్య
హైదరాబాద్: తెలంగాణ సాధన కోసం దేనికైనా రెడీ అని మంత్రి బసవరాజు సారయ్య అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జెండాలు, ఎజెండాలు పక్కనబెట్టి పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైందని సారయ్య తెలియజేశారు. ఈసారి కనుక తెలంగాణ రావడం తప్పిపోతే మళ్లీ రావడం కష్టమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.