తెలంగాణ సాయుధ పోరాటానికి నిజమైన వారసులు కమ్యూనిస్టులే

– సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి
సూర్యాపేట, జనంసాక్షి : తెలంగాణ సాయుధ పోరాటానికి నిజమైన వారసులు కమ్యూనిస్టులేనని మాజీ ఎమ్మెల్యే, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు  జూలకంటి రంగారెడ్డి అన్నారు.బుధవారం జిల్లా కేంద్రంలోని సీతారామ ఫంక్షన్ హాల్ లో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు అధ్యక్షతన  జరిగిన తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవ సభకు ఆయన  ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.తెలంగాణ ప్రాంతంలో వెట్టి చాకిరి, దొరల దోపిడీకి వ్యతిరేకంగా కమ్యూనిస్టుల నాయకత్వంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరిగిందన్నారు.ఈ పోరాటం మూలంగా వెట్టి చాకిరి నుండి ప్రజలకు విముక్తి కలిగిందన్నారు.ఈ పోరాటంలో 3000 మంది కమ్యూనిస్టు యోధులు మరణించారని, 4500 గ్రామాలు వెట్టి నుండి విముక్తి అయ్యాయని చెప్పారు.సాయుధ పోరాటం మూలంగా పేద ప్రజలకు 10 లక్షల ఎకరాల భూమిని కమ్యూనిస్టులు పంచి పెట్టారని గుర్తు చేశారు.తెలంగాణ సాయుధ పోరాటానికి సంబంధంలేని బిజెపి తెలంగాణ సాయుధ పోరాటాన్ని వక్రీకరించి మాట్లాడడం సిగ్గుచేటన్నారు.వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట చరిత్ర తెలియని బండి సంజయ్ నాటి కమ్యూనిస్టుల త్యాగాలను అవహేళనాగా చేస్తూ మాట్లాడడం సబబు కాదన్నారు.ఈ నెల 17న రాష్ట్రవ్యాప్తంగా సభలు, సమావేశాలు నిర్వహించి అమరవీరుల త్యాగాలను పోరాటాలను ప్రజల్లోకి తీసుకువెళ్తామన్నారు.17న అర్వపల్లి మండల కేంద్రంలో జరిగే తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవ సభకు సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి హాజరుకానున్నట్లు చెప్పారు.వివిధ రాష్ట్రాల్లో ఎన్నికైన బిజెపి వ్యతిరేక ప్రభుత్వాలను కూల్చే పనిలో పీఎం మోడీ నిమగ్నమయ్యారని వారన్నారు.ఓట్లు వేసి గెలిపించిన ప్రజల యొక్క తీర్పులకి వ్యతిరేకంగా ప్రభుత్వాలని కూల్చడం మంచి పద్ధతి కాదన్నారు. కేంద్రంలోని మోదీ సర్కార్‌ అదానీ, అంబానీ వంటి కార్పొరేట్‌శక్తులకు కొమ్ముకాస్తూ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించి కార్మికుల ఉపాధిని దెబ్బతీస్తోందన్నారు.బీజేపీ అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా జరిగే ఆందోళనలు, పోరాటాల్లో ప్రజలు భాగస్వాములు కావాలన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఎం  రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మల్లు లక్ష్మి , జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి ,జిల్లా కమిటీ సభ్యులు కొలిశెట్టి యాదగిరిరావు ,బుర్రి శ్రీరాములు, మట్టి పెళ్లి సైదులు ,ఎల్గూరి గోవింద్, కోట గోపి ,దండ వెంకటరెడ్డి, వేల్పుల వెంకన్న ,జిల్లపల్లి నరసింహారావు ,వీరబోయిన రవి ,చెరుకు ఏకలక్ష్మి, మేకన పోయిన శేఖర్ ,కొప్పుల రజిత, మేకన పోయిన సైదమ్మ ,మద్దెల జ్యోతి, మేదరమెట్ల వెంకటేశ్వరరావు, దేవరం వెంకటరెడ్డి, పారేపల్లి శేఖర్ రావు ,కొదమగుండ్ల నగేష్, న గారపు  పాండు, షేక్ యాకోబ్, పల్లె వెంకటరెడ్డి ,దుగ్గి బ్రహ్మం, పాండు నాయక్, బుర్ర శ్రీనివాస్ ,కందాల శంకర్ రెడ్డి, పులుసు సత్యం, మిట్ట గడుపుల ముత్యాలు, వట్టెపు సైదులు, జుట్టుకొండ బసవయ్య ,చిన్నపంగా నరసయ్య తదితరులు పాల్గొన్నారు.
Attachments area