తెలంగాణ సాయుధ పోరాట చరిత్ర ను వక్రీకరిస్తున్న మతోన్మాద శక్తులు
మిర్యాలగూడ జనం సాక్షి,
తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరణ చేస్తున్న మతోన్మాద శక్తులు
భూమికోసం భుక్తి కోసం తెలంగాణ విముక్తి కోసం సాగిన మహత్తరమైన పోరాటాన్ని బిజెపి పార్టీ హిందూ ముస్లింల మధ్య జరిగినటువంటి పోరాటంగా చిత్రీకరణ చేయడం చరిత్రని వక్రీకరణ చేయడమేనని సిపిఐ జిల్లా కార్యదర్శి నెల్లి కంటి సత్యం అన్నారు గురువారం రోజున తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవ భాగంగా యాదిగార్ పల్లి లో సిపిఐ ఆధ్వర్యంలో వారోత్సవాల సభ నిర్వహించడం జరిగినది ఈ సందర్భంగా సత్యం మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నారు సమరయోధులను ఒకపక్క బీజేపీ ప్రభుత్వం అవమాన పరుస్తూ మరొక పక్క సాయుధ పోరాటం స్మరించడం అంటే దయ్యాలు వేదాలు వల్లించడం అన్నారు దున్నే వానిదే భూమి అని వెట్టిచాకిరి రద్దు కావాలని భాంచంద్ దొర అన్న ప్రజలని బందుకు పట్టించి నైజాముని గడగడలాడించిన వీర తెలంగాణ అని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సాయుధ పోరాట యోధులని ఈ సందర్భంగా స్మరించి చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలని డిమాండ్ చేశారు తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలు నిర్మించాలని సాయుధ పోరాటం వారసులు కమ్యూనిస్టులని అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బంటు వెంకటేశ్వర్లు. మండల కార్యదర్శి లింగా నాయక్. రైతు సంఘం నాయకులు కనకయ్య చంద్రమౌళి. మహిళా సమాఖ్య నాయకురాలు దుర్గమ్మ. శాంతా. పద్మ. షమీం తదితరులు పాల్గొన్నారు