తెలంగాణ సాయుధ పోరాట వారసులు విప్లకారులే
వరంగల్ ఈస్ట్, సెప్టెంబర్ 17(జనం సాక్షి)
మరోసారి అధికారం నిలబెట్టుకోవడం కోసం కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రాష్ట్రంలోని కెసిఆర్ ప్రభుత్వం సెప్టెంబర్ 17 విద్రోదినాన్ని విమోచన విలీన దినంగా చూయించడానికి పోటీ పడుతున్నాయని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ వరంగల్ నగర కార్యదర్శి ఆరెల్లి కృష్ణ విమర్శించారు
సెప్టెంబర్ 17 విద్రోహ దినముగా జరపాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా ఈరోజు వరంగల్ నగరంలోని ఖమ్మం హైవే కిలా వరంగల్ ఫోర్ట్ రోడ్డులోని వై జంక్షన్ వద్ద సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ కార్యకర్తలు నల్ల జెండాలతో నిరసన కార్యక్రమం చేశారు
సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు రాచర్ల బాలరాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో న్యూ డెమోక్రసీ నగర కార్యదర్శి ఆరేల్లి కృష్ణ నాయకులు బండి కోటేశ్వరరావు ఐ ఎఫ్ టి యు జిల్లా అధ్యక్షులు గంగుల దయాకర్ లు మాట్లాడారు
భూస్వాముల దోపిడికి వ్యతిరేకంగా పెట్టి చాకిరి విముక్తి కోసం నైజాం నిరంకుశ రజాకార ప్రభుత్వానికి వ్యతిరేకంగా 1946 నుండి 51 వరకు జరిగిన చారిత్రక విరోచిత తెలంగాణ సాయుధ పోరాట ఉద్యమాన్ని మరిపించేందుకు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రాష్ట్రంలోని కెసిఆర్ ప్రభుత్వం విమోచన విలీన దినాలుగా జరుగుతున్నాయని వారు విమర్శించారు
ఈ కార్యక్రమంలో ఐ ఎఫ్ టి యు నగర అధ్యక్షులు బన్న నర్సింగం, నాయకులు చంద్రయ్య ఇనుముల కృష్ణ సాంబయ్య రాజు ప్రభాకర్ ఏలియా పి వై ఎల్ జిల్లా నాయకులు హరిబాబు సుమన్ రమేష్ తదితరులతో పాటు న్యూ డెమోక్రసీ కార్యకర్తలు పాల్గొన్నారు
Attachments area