తెలంగాణ స్పీకర్‌ను కలిసిన కాంగ్రెస్‌, బీజేపీ ఎమ్మెల్యేలు 

– స్పీకర్‌ వైఖరిపై తప్పుబట్టిన విపక్షనేతలు
హైదరాబాద్‌,నవంబర్‌1(జ‌నంసాక్షి) : తెలంగాణ శాసనసభ స్పీకర్‌ మధుసూదనచారిని టీ.కాంగ్రెస్‌, బీజేపీ, టీడీపీ సభ్యులు కలిశారు. విూరు సభ నిర్వహించే తీరు సరిగా లేదు.. గౌరవంగా లేదంటూ స్పీకర్‌కు తెలియజేశారు. విపక్షనేతకు మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం సభకు హుందాతనం కాదని స్పీకర్‌ను తప్పుబట్టారు. విూ తీరు మారకపోతే సభకు రావాల్సిన అవసరం ఏముంది? స్పీకర్‌తో కాంగ్రెస్‌ సభ్యులు పేర్కొన్నారు.. సభ తీరుకు వ్యతిరేకంగా స్పీకర్‌ పోడియం వద్ద నిరసన వ్యక్తం చేశారు. అనంతరం విూడియాతో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే మల్లు భట్టి మాట్లాడుతూ.. విపక్షనేత పాత్ర లేకుండా సభ జరగడం సరికాదన్నారు. కొత్త అసెంబ్లీ నిర్మాణం చర్చలో మైకు ఇవ్వకపోతే ఎలా అంటూ అధికార పార్టీనేతలను ప్రశ్నించారు. స్పీకర్‌పై కూడా మాట్లాడాల్సిన పరిస్థితులు కల్పిస్తున్నారనంటూ భట్టి ఆవేదన వ్యక్తం చేశారు.

తాజావార్తలు