తెలంగాన రాజకీయాల్లో సిఎం కెసిఆర్ కొత్త ఒరవడి
అభివృద్ది లక్ష్యంగా పనలుకు శ్రీకారం: మంత్రి జగదీశ్వర్ రెడ్డి
నల్లగొండ,ఏప్రిల్6(జనంసాక్షి): దేశంలో ఎక్కడా లేనివిధంగా సంక్షేమ, అభివృద్ది పథకాలతో సిఎం కెసిఆర్ ముందుకు దూసుకుని పోతున్నారని మంత్రి గుంటకండ్ల జగగీష్‌రెడ్డి అన్నారు. గతంలో ఎక్కడా ఎప్పుడూ అమలు చేయని అనేక కార్యక్రమాలు తెలంగాణ ఆవిర్భావం తరవాతనే చేప్టటడం జరిగిందన్నారు. దీంతో దేశ రాజకీయాల్లో సీఎం కేసీఆర్ నూతన ఒరవడిని సృష్టిస్తున్నారని అన్నారు. నల్లగొండ పర్యటనలో ఉన్న మంత్రి సాగునీటి ప్రాజెక్టులపై సీఎం పవర్ పాయింట్ ప్రజెంటేషన్, కాంగ్రెస్ నేతల తీరుపై స్పందించారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ వంటి కార్యక్రమాలు సాగునీటి రంగ గతిని మార్చబోతున్నాయని అన్నారు. రీ డిజైనింగ్ ద్వారా నదీజలాలను పూర్తిస్థాయిలో అన్ని ప్రాంతాలకు వినియోగించుకునేలా చేస్తున్నారని అన్నారు. దేశ రాజకీయాల్లో కొత్త ఒరవడిని సృష్టించి ప్రజలకు ప్రభుత్వం జవాబుదారీగా, పారదర్శకంగా ఉండేందుకే సీఎం కేసీఆర్ అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారని అన్నారు. అయితే ఈ కార్యక్రమాన్ని బహిష్కరించిన కాంగ్రెస్ నేతలు అసెంబ్లీ బయట విమర్శలు చేయడం వారి అజ్ఞానానికి నిదర్శనమన్నారు. ఎన్నో నిద్రలు లేని రాత్రులు గడిపి సీఎం కేసీఆర్ ఊహకందని భగీరథ ప్రయత్నం చేశారని అన్నారు. దేశం మొత్తం సీఎం కేసీఆర్ ఇచ్చిన ప్రజెంటేషన్‌పై చర్చించుకుంటున్న సందర్భంలో కాంగ్రెస్ మాత్రమే విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇతర రాష్టాల్ర ప్రజలు మాత్రం తమకు కెసిఆర్ లాంటి నాయకుడు లేడే అని బాధపడుతున్నారని అన్నారు. సీఎం కేసీఆర్ ప్రజెంటేషన్ సందర్భంగా అసెంబ్లీ నుంచి కాంగ్రెస్ నేతలు ఎందుకు పారిపోయారో ప్రజలకు సమాధానం చెప్పాలని మంత్రి అన్నారు. లేదంటే ప్రజలే నిలదీసి అడుగుతారని అన్నారు. ఓట్ల కోసం చిల్లర రాజకీయాలు చేయొద్దని, ప్రజలు తమను ఆదరిస్తారనే భ్రమల్లో కాంగ్రెస్ నేతలు బతుకుతున్నరని విమర్శించారు. చరిత్రలో నిలిచిపోయే మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పనులను అడ్డుకుని చరిత్ర హీనులుగా మారొద్దని హితవు పలికారు. ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ నేతలు కొత్త నాటకాన్ని మొదలుపెట్టినట్లు మంత్రి విమర్శించారు. అసలు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పిందే సిఎం కెసిఆర్ అని అన్నారు. కాంగ్రెస్ నేతల మధ్య ఐక్యత లేకనే ప్రజల ముందు అభాసుపాలవుతున్నరు. కాంగ్రెస్ నేతలు ఉత్తరకుమార్ రెడ్డి ప్రగల్బాలు మానాలని అన్నారు. సమైక్య పాలనలో ఆంధ్రా నాయకులకు తొత్తులుగా మారి ప్రాంత ప్రయోజనాలను మర్చిపోయారని మంత్రి దుయ్యబట్టారు. గత పదేళ్ల పాలనలో ఏనాడు ప్రజల గురించి పట్టించుకోని నాయకులు ఇవాళ ప్రజల కోసం అంటూ ప్రగల్భాలు పలుకుతున్నారని అన్నారు. గత పదేళ్లుగా కేంద్రంలో రాష్ట్రంలో , కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ నేతలు ముస్లిం రిజర్వేషన్లపై ఎందుకు నోరు మెదపలేదన్నారు. అలాగే పక్క రాష్ట్రంలో ప్రాజెక్టులు కడుతుంటే ఎందుకు నోరు మెదపలేదన్నారు. మైనార్టీల కోసం అంటూ సంతకాల సేకరణ చేపట్టడాన్ని తప్పు పట్టారు. ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ నేతలు మాట్లాడటం విడ్డూరంగా ఉందని మంత్రి అన్నారు. ప్రభుత్వం ముస్లిం రిజర్వేషన్లను అమలు చేయడం లేదంటూ కాంగ్రెస్ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టడాన్ని ఆయన తప్పుబట్టారు. అధికారంలో ఉన్నప్పుడు రిజర్వేషన్లను ఎందుకు అమలు చేయలేదో వివరించి కాంగ్రెస్ నేతలు ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. 12శాతం ముస్లిం రిజర్వేషన్లకు తాము కట్టుబడి ఉన్నామని… దీనిపై అధ్యయం చేసేందుకు సుధీర్ కమిటీని ప్రభుత్వం నియమించిందని మంత్రి తెలిపారు. చర్చకు రమ్మంటే భయపడిన కాంగ్రెస్ నేతలు ఇవాళ ముస్లింల రిజర్వేషన్లపై కొత్తగా మొసలి కన్నీళ్లు కారుస్తున్నారని ధ్వజమెత్తారు. ముస్లింకు రిజర్వేషన్ల పేరిట ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సంతకాల సేకరణ చేయడం అర్థరహితమన్నారు. చిల్లర రాజకీయాలకు పాల్పడొద్దని మంత్రి హితవు పలికారు.