తెలుగుజాతి యుగపురుషుడు ఎన్టీఆర్‌: చంద్రబాబు నాయుడు

హైదరాబాద్‌, జనంసాక్షి: తెలుగు జాతి యుగపురుషుడు ఎన్టీఆరేనని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు. హిమాయత్‌నగర్‌లోని గండిపేట తెలుగు విజయంలో జరుగుతున్న మహానాడులో ఆయన మాట్లాడారు. తెలుగువారి సత్తాను ప్రపంచానికి చాటి చెప్పాన నేత ఎన్టీఆర్‌ అని కొనియాడారు. తమ హయాంలో మిగులు విద్యుత్‌ ఉండేదని, ఇప్పుడు రాష్ట్రం తీవ్ర విద్యుత్‌ సంక్షోభంతో కొట్టుమిట్టాడుతుందని చెప్పారు. విద్యుత్‌ సమస్యలతో పరిశ్రమలు మూతపడ్డాయన్నారు. వ్యవసాయం దెబ్బతిందని పేర్కొన్నారు. ‘అమ్మ హస్తం’ మొండి హస్తం అన్న వ్యాఖ్యలు ఇప్పుడు నిజమయ్యాయన్నారు.
పాదయాత్రలో కార్యకర్తలు, ప్రజలు నిండు మనసుతో సహకరించారని చెప్పారు. టీడీపీ అధికీరంలోకి వస్తే రైతుల రణమాఫీపైనే తొలి సంతకం అన్నారు.