తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ భేటీ

మెదక్‌ : తెదేపా పార్లమెంటరీ పార్టీ సమావేశం మెదక్‌ జిల్లా చింతపల్లిలో ప్రారంభమైంది. పార్లమెంటరీ పార్టీ నేత నామా నాగేశ్వర్‌రావు, గుండు సుధారాణివ, రమేష్‌ రాథోడ్‌, సీఎం రమేష్‌, హరికృష్ణ, సుజనాచౌదరి తదితరులు ఈ భేటికి హాజరయ్యారు. ఈనెల 22 నుంచి జరగనున్న పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలు చర్చిస్తున్నారు. 2014 ఎన్నికల్లో తెదేపా నుంచి సీనియర్లను లోక్‌సభకు పంపాలనేది అందరి అభిప్రాయమని ఈ విషయాన్ని అధినేత దృష్టికి తీసుకెళ్తామని నామా తెలిపారు.