తెలుగుసభలో తెలంగాణకు గౌరవం లభించలేదు : కేకే

హైదరాబాద్‌: ప్రపంచ తెలుగు మహాసభల్లో తెలంగాణ ప్రాంతంవారికి సముచిత స్థానం లభించకపోవడంపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కేశవరావు విచారం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రముఖులైన సినారె, దాశరధి లాంటి వారికి ప్రాతినిధ్యం ఇవ్వలేదన్నారు. తెలుగు మహాసభల ఆహ్వానపత్రికలో దళితుడైన ఉప ముఖ్యమంత్రి , సమాచారశాఖమంత్రుల పేరు లేకపోవడంపై ఆయన అభ్యంతరం వ్యర్తం చేశారు.