తెలుగు దేశానికి మరో షాక్‌

1

-కారెక్కేందుకు మంచిరెడ్డి రెడీ

-గులాబీ బాస్‌తో చర్చలు

-టీడీపీకి రాజీనామా

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 22 (జనంసాక్షి):

తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే,రంగారెడ్డి జిల్లా టిడిపి అధ్యక్షుడు  మంచిరెడ్డి కిషన్‌రెడ్డి గులాబీ గూటికి చేరనున్నారు. బుధవారం ఉదయం ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మంచిరెడ్డి సమావేశమయ్యారు. అనంతరం ఆయన విూడియాతో మాట్లాడుతూ ఈనెల 24న టీఆర్‌ఎస్‌లో చేరనున్నట్లు తెలిపారు. టీడీపీకి, జిల్లా టిడిపి అధ్యక్షపదవికి  రాజీనామా చేస్తున్నానన్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంతో పాటు రంగారెడ్డి జిల్లా  అభివృద్ధి కోసమే టీఆర్‌ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్నట్లు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి తెలిపారు.  నియోజకవర్గ ప్రజల అభిమతం మేరకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. తెదేపా జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామ చెసినట్లు వెల్లడించారు. మంచిరెడ్డి కిషన్‌రెడ్డి తెదేపా తరపున ఎమ్మెల్యేగా ఇబ్రహీంపట్నం నుంచి గెలుపొందిన విషయం తెలిసిందే. మంత్రులు హరీష్‌ రావు, తుమ్మల నాగేశ్వరరావులతో కలసి క్యాంపు కార్యాలయంలో మంచిరెడ్డి సిఎం కెసిఆర్‌ను కలిశారు. వివిధ అంశాలపై చర్చించారు. గత కొద్ది రోజులుగా ఆయన టిఆర్‌ఎస్‌లో చేరే  అంశంపై చర్చ జరుగుతోంది. కిషన్‌ రెడ్డి కూడా పలువురు నేతలతో చర్చించిన అంతిమంగా టిఆర్‌ఎస్‌ లో చేరడానికే మొగ్గు చూపారు.

కిషన్‌ రెడ్డి స్థానే టిడిపి ఎమ్‌.పి దేవేందర్‌ గౌడ్‌ కుమారుడు వీరేందర్‌ గౌడ్‌ కు ఇబ్రహింపట్నం బాధ్యత అప్పగించాలని పార్టీ నాయకత్వం నిర్ణయించిందని సమాచారం.కాగా టిఆర్‌ఎస్‌ లోకి వెళ్లకుండా ఆగిన రాజేంద్ర నగర్‌ ఎమ్మెల్యే ప్రకాష్‌ గౌడ్‌ కు జిల్లా టిడిపి అద్యక్ష బాధ్యత లు అప్పగించవచ్చని చెబుతున్నారు. నియోజకవర్గ అభివృద్ది కోసమే తాను టిడిపిని వీడి, టిఆర్‌ఎస్‌ లో చేరుతున్నట్లు కిషన్‌ రెడ్డి ప్రకటించారు. ఇబ్రహింపట్నం అభివృద్దికి నిదులు ఇవ్వడానికి ముఖ్యమంత్రి హాహీా ఇచ్చారని ఆయన తెలిపారు. నియోజకవర్గంలో కార్యకర్తల అబిప్రాయాలు తీసుకున్న తర్వాతే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని ఆయన చెప్పారు. టిఆర్‌ఎస్‌ ప్లీనరీ రోజున టిఆర్‌ఎస్‌ లో చేరుతున్నట్లు కిషన్‌ రెడ్డి చెప్పారు. భవిష్యత్తులో ఎందరు టిఆర్‌ఎస్‌ లో చేరతారో అప్పుడే చెప్పలేనని , అది కాలమే చెబుతుందని ఆయన అన్నారు.