*తెలుగు భాష సంకెళ్లు వీడేదెప్పుడో ?*

పరిపాలనా యంత్రాంగంలో
తెలుగు మార్పు రానంత వరకు
మాతృభాష దినోత్సవానికి
విలువలేదు
పరిపూర్ణమైన స్వేచ్చ లేదు
కవుల కలాల్లో
గాయకుల గళ్ళలో
పండితుల పద్యాల్లో
రచయితల రచనల్లో
మాతృభాషకై తపన
అధికార యంత్రాంగంలో
మాతృభాష నిరసిస్తోంది
పట్టం కట్టవలసిన
ప్రభుత్వాలలో
చిత్తశుద్ధి లోపించింది
మాతృభాష నీకు జోహార్లు
నీ సంకెళ్లు వీడేదెప్పుడో
మాతృభాషకు స్వేచ్ఛ ఎప్పుడో
పరిపాలనా యంత్రాంగంలో
నిండుగా నీవు పరిమళించిన నాడే
మాతృభాష దినోత్సవానికి విలువ
మాతృభాష నీ సంకెళ్లు వీడేదెప్పుడో………
        *” కావ్యసుధ “*
*సాహితీ సేవారత్న అవార్డు గ్రహీత*
          హైదరాబాద్