తెలుగు మహాసభల నిర్వహణ గర్వకారణం
సిద్దిపేట,డిసెంబర్15(జనంసాక్షి): ప్రపంచ మహాసభలు నిర్వహించడం ఆనందంగా ఉందని సిద్దిపేట మున్సిపల్ చైర్మన్ రాజనర్సు అన్నారు. సీఎం కేసీఆర్ తెలుగుభాష అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నారని తెలిపారు. తెలుగుభాష పరిరక్షణకు అందరు పాటుపడాలని కోరారు. రాష్ట్రం ఏర్పాటయ్యాక
ప్రజలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని వెల్లడించారు. తెలుగు సాహితీవేత్త, అనేక గ్రంథాలు చదివిన సీఎం కేసీఆర్ ఉండడం మన అదృష్టమన్నారు.దీనిని జీర్ణించుకోలేని ఆంధ్రావాళ్లు అరెస్టులతో జైళ్లో పెట్టించారని తెలిపారు. ప్రపంచ తెలుగు మహాసభలను పురస్కరించుకొని వారం రోజులుగా జిల్లా కేంద్రమైన సిద్దిపేటలో సన్నాహక కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు. ప్రపంచ తెలుగు మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.