తెలుగు రాష్టాల్ర అభివృద్ది పట్టని బడ్జెట్‌ 

కేంద్ర బడ్జెట్‌లో తమకు అన్యాయం జరిగిందని ఉభయ తెలుగు రాష్టాల్ల్రో అధికారంలో ఉన్న పార్టీల నేతలు మండిపడుతున్నారు. అలాగే విభజన సమస్యలపై దృష్టి పెట్టి కేటాయింపులు జరపలేదని అంటున్నారు. ఈ క్రమంలో ఇరు రాష్టాల్ర ఎంపిలు దీనిపై పార్లమెంటు వేదికగా నిలదీయాల్సిన అవసరం ఉంది. వివిధ సమస్యలపై కేంద్రాన్ని అడగాల్సిందే. బయట ప్రకటనలు చేసేకన్నా సభలోనే నిగ్గదీయాలి. అన్యాయాలను ప్రశ్నించాలి. చేనేత రంగానికి భరోసా దక్కలేదు. ప్రాజెక్టులపై భరోసా ఇవ్వలేదు. అభివృద్ది పనులకు నిధుల విషయంమరిచారు. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ఒప్పుకున్నా.. ఒప్పుకోక పోయినా దేశం ఆర్థికంగా క్లిష్టపరిస్థితుల్లో ఉందన్నది సుస్పష్టం. ఆర్థికస్థితి ఏమాత్రం బాగున్నా బడ్జెట్‌ ప్రతిపాద నలు ఎలా ఉన్నా భరోసా ఉండేది. అలాగే రాష్టాల్రను అభివృద్ది చేయడమంటే దేశాన్ని అభివృద్ది చేసుకోవడం అన్న విషయాన్ని పాలకులు గుర్తించడంలేదు. కనీసం బిజెపి ప్రభుత్వం కూడా గుర్తించడం లేదు. పట్టణాలు, నగరాలను అభివృద్ది చేయడం, మౌళిక సదుపాయాలకు నిధులు వెచ్చించడం వంటి ప్రణాళికలు తీసుకో లేదు. రోడ్డ,రైలు మార్గాలను అభివృద్ది చేయాలన్న సంకల్పం బడ్జెట్‌లో కానరాలేదు. ప్రధాన రంగాలను అభివృద్ది చట్రంలోకి తీసుకుని వచ్చి ముందుకు సాగితే తప్ప దేశం పురోగమించదని గుర్తింనంత కాలం ఏ రంగానికి ఎంత కేటాయించినా లాభం ఉండదు. ఇకపోతే బడ్జెట్‌లో ఆదాయపు పన్ను విషయంలో ఎలాంటి భరోసా లేక పోవడంతో సగటు పన్నుదారుడిని గందరగోళంలో ముంచేసింది. పన్ను శ్లాబులను బాగా తగ్గించి, చేతిలో మిగులు సొమ్ము ఎక్కువ ఉంచగలిగితే ప్రజల కొనుగోలు శక్తి పెరిగి ఆర్థిక వ్యవస్థ మెరుగు పడుతుంది. కానీ, ఆర్థికమంత్రి ప్రజలను పొదుపు మాని, ఉన్నదంతా ఖర్చు చేయమం టున్న తీరుగా ప్రతిపాదనలు ముందుంచారు. భవిష్యత్‌ భద్రతను గాలికొదిలేసి ఖర్చుదారులుగా మారి పోమంటున్నారు. బడ్జెట్‌ బాగుందని చంకలు గుద్దుకుంటున్న ప్రభుత్వ వర్గాలు మాత్రం అందుకు తగ్గట్లుగా సమాధానం చెప్పలేకపోతున్నాయి. అలాగే ఆర్థికరంగం కుదేలవుతున్న వేళ తీసుకుంటున్న చర్యలకు సంబంధించి బడ్జెట్‌లో ఎలాంటి హావిూదక్కలేదు. తెలంగాణకు అన్యాయం జరిగిందని తెలంగాణ ఐటిశాఖ మంత్రి, టిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రసిడెంట్‌ కేటీఆర్‌ ఘాటుగానే విమర్శిస్తున్నారు. రాష్టాన్రికి కేంద్రం అదనంగా ఒక్క పైసా కూడా అదనంగా ఇవ్వలేదని తెలిపారు. బీజేపీ నేతలకు దమ్ముంటే ఢల్లీి నుంచి నిధులు తీసుకుని రావాలని సవాలు విసిరారు. తమకూ అన్యాయం జరిగిందని, ఎపికి కేటాయింపులు జరపలేదని వైకాపా నేతలు మండిపడ్డారు. మధ్య తరగతి ప్రజలు కూడా తమకు ఎలాంటి లాభం లేదని వాపోయారు. ఇన్‌కమ్‌ టాక్స్‌ తగ్గింపుల కోసం ఎదురుచూసిన ఉద్యోగవర్గాలు పెదవి విరిచాయి. ఇకపోతే ప్రధానంగా రాష్టాల్రకు రావాల్సిన పన్నుల వాటాలు రావడం లేదు. దేశీయంగా డిమాండ్‌ తగ్గడంతో జీడీపీ పదేళ్ళ కనిష్ఠానికి పడిపోయింది. ఉత్పాదకత కుంటుపడటంతో పన్నువసూళ్ళు సన్నగిల్లి, ద్రవ్యలోటు పెరిగి, ప్రభుత్వ వ్యయం తగ్గింది. నిరుద్యోగం పెరుగుతూ పోవడంవల్ల యువతలో నైరాశ్యం నెలకొంది. దీనికి సంబంధించి గత ఐదేళ్లలో ఎంతమందికి ఉద్యోగావకాశాలు వచ్చాయో లెక్కలేదు. నిస్తేజంగా ఉన్న ఆర్థిక వ్యవస్థకు బడ్జెట్‌ భరోసా కలిగించకపోగా, సగటుమనిషికి సంతృప్తిని మిగల్చలేకపోయింది. మొత్తంగా వృద్ధికి ఊతమిచ్చే కనీస చర్యలేవీ బడ్జెట్‌లో లేక పోయాయి. మాంద్యం దెబ్బతో నీరసించిపోతున్న రాష్టాల్రను కేంద్రం ఆదుకునే ప్రయత్నాలు చేయడంలేదు. రాయితీలు, ఉద్దీపనలు ఊపిరిపోయడం లేదు. ఆర్థిక రంగం ఒడిదుడుకులు ఎదుర్కొంటూ, మందగమనంతో అది అందరినీ భయపెడుతున్న వేళ… అందరినీ మెప్పించ లేకపోయినా ప్పుడున్న కరోనా సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు మార్గాలు అన్వేషించలేదు. ఉపాధి అవకాశాలు పెరిగితేనే ఆదాయం వస్తుంది. ఆ వచ్చిన ఆదాయం పన్నుల రూపంలో పెద్దగా పోనప్పుడు వారు తమ అవసరాల కోసం ఖర్చు పెట్ట గలుగుతారు. అయితే ఈ క్రమంలో ఖజానా పెద్దగా నష్టపోకూడదని ప్రభుత్వం భావిస్తుంది. పన్ను వసూళ్లు తగ్గకుండా వున్నప్పుడే అది సాధ్యమవుతుంది. కనుక ప్రజల కొనుగోలు శక్తి పెంచి వినిమయం బాగుండేలా తీసుకునే చర్యలకూ, ఖజానా దండిగా నిండటానికి చేసే ప్రయత్నాలకూ మధ్య వైరుధ్యం ఉంటుంది. దీన్నెంత ఒడుపుగా చేయ గలుగుతారన్న దాన్నిబట్టే ఆర్థికమంత్రి చాకచక్యం వెల్లడవుతుంది. జిఎస్టీ వసూళ్లు పెరడం అభివృద్ది కాదన్నది గుర్తించడం లేదు. మిగిలినవాటి మాటెలావున్నా ప్రతి బ్జడెట్‌కు ముందూ మధ్యతరగతి ఆశగా ఎదురు చూసేది ఆదాయం పన్ను మినహాయింపు. కేంద్ర ఆర్థిక మంత్రి కనికరించి గడిచిన సంవత్సరం కన్నా పన్ను భారం మరింత తగ్గిస్తే బాగుండునని మధ్యతరగతి జీవులు ఆశించారు. ఆ విషయంలో ప్రతిసారీ వారికి నిరాశే ఎదురవుతోంది. ఇప్పుడున్న శ్లాబ్‌లను యధాతథంగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించారు. మొత్తంగా ప్రధాన రంగాలను ఎంచుకుని రాష్టాల్రను విశ్వాసంలోకి తీసుకుని ఖర్చులు పెడితే విభేదాలు రావు. రాజకీయాలకు అతీతంగా కేటాయింపులు ఉండాలే తప్ప మరోలా ఆలోచన చేయరాదు. గతేడాది బడ్జెట్‌ కేటాయింపులు, అమలను ముందరేసుకుని చర్చిస్తే ఏ మేరకు అభివృద్ది సాధించామో అవగతం అవుతుంది. మరింత వృద్ధి,మరిన్ని ఉపాధి అవకాశాల కల్పనే లక్ష్యంగా రూపొందిన ప్రగతిశీల బడ్జెట్‌ అంటూ ప్రధాని పేర్కొన్నా అలాంటి వాసన ఎక్కడా కానరావడం లేదు. పేదల సంక్షేమానికి పెద్దపీట వేసినట్లుగా చెప్పుకుంటున్నా..ప్రజల జీవనంలో ఎలాంటి మార్పులు గోచరించడం లేదు. ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేస్తూనే, సామాన్యుడు ఎదుర్కొంటున్న సమస్య లను పరిష్కరించి సరికొత్త అవకాశాలు చూపడమే లక్ష్యంగా ఈ బడ్జెట్‌ రూపొందిందని ప్రధాని చెప్పుకు న్నారు. ప్రతి నిరుపేదకూ పక్కా ఇల్లు, టాయిలెట్‌, నల్లా నీరు, గ్యాస్‌ కనెక్షన్‌ల కలను సాకారం చేయను న్నట్లు పేర్కొన్నా..పెరుగుతున్న ధరలను కంట్రోల్‌ చేసే కీ గురించి ఆలోచన చేయడం లేదు. అగ్రి స్టార్టప్‌ లకు ప్రోత్సాహం, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ఇండస్ట్రీకి ప్యాకేజీ వంటివి రైతు ఆదాయాన్ని బాగా పెంచేవని అంటున్నా ఆచరణలో ఎంతమేరకు రాణిస్తాయన్నది చూడాలి. ’ఆత్మనిర్భర్‌ భారత్‌ బ్జడెట్‌’ అంటూ ఊదర గగొట్టకుండా క్షేత్రస్థాయిలో సమస్యలను తెలుసుకుని అందుకు అనుగుణంగా ఆయా రంగాలను పైకి తీసుకుని వచ్చేలా చేయడంలో మాత్రం విఫలం అవుతూనే ఉన్నారు.