తైక్వాండో క్రీడలతో దేహదారుఢ్యం.

పట్టణ టిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్.
తాండూరు డిసెంబర్ 4(జనంసాక్షి)తైక్వొండో క్రీడతో మానసిక ఉల్లాసంతో పాటు దేహదారు ఢ్యం పెంపోందిస్తాయని పట్టణ టిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆదివారం తాండూరు పట్టణంలోని శివం హైస్కూల్
ఆవరణలో ముఖ్య అత్ధిదిగా పాల్గొని బెల్ట్ పరిక్షలను ప్రారంబించారు. తెలంగాణా రాష్ట్ర ఉపాధ్యక్షులు వారికి ఘన స్వాగతం పలికి..ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సి ఏం  కేసీఆర్ నాయకత్వంలో క్రీడాలకు, క్రీడాకారులకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని అన్నారు.ప్రతి నియోజకవర్గంలో నూతన స్టేడియం నిర్మిస్తున్నారని,క్రీడలు  క్రీడా స్ఫూర్తిని  పెంచుతాయని తెలిపారు. క్రీడాకారులు క్రిడల్లో రానించి తల్లిదండ్రులకు ,జిల్లా, రాష్ట్రా నీకీ, దేశానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు.
అనంతరం ఆవరణలో క్రీడాకారులు
అభిషేక్, శరత్,సోహెల్,హుస్సేబ్ అహ్మద్,సహిర మహిన్,అనస్, కూల్ సుం, శ్రేష్ట,శ్రీనిక బ్లాక్ బెల్ట్ లను శ్రీనివాస్,మాస్టర్ మనోహర్,దౌలయ్య చేతుల మీద గా బ్లాక్ బెల్ట్ , ధ్రువ పత్రాలను అందుకున్నారు.బ్లాక్ బెల్ట్, కలర్ బెల్ట్ లను పంపిణి చేశారు.అదేవిదంగా ధ్రువపత్రాలను అందజేశారు.ఈ కార్యక్రమంలో నాయి  బ్రాహ్మణ మాజీ అధ్యక్షులు దావులయ్య, మాస్టర్ మనోహర్ , నర్సింహా, సిపిఏం శ్రీనివాస్
 కోచ్ లు మాస్టర్ కుషల్, వివేక్, నొమన్, అర్షద్, గౌతమ్, తంజిర్ అహ్మద్, సత్యేందర్, సంత్ర, రైజో, క్రీడాకారుల తల్లిదండ్రులు రమేష్,
అప్సర్ ఖాన్ , తదితరులు పాల్గొన్నారు.