తొమ్మిదవ వార్డు లక్ష్మీ నరసింహ కాలనీ లో ప్రజా సమస్యలను పట్టించుకోని మున్సిపాలిటీ సిబ్బంది, వనపర్తి
టౌన్/ మున్సిపాలిటీ విభాగం/: నవంబర్ 7 (జనం సాక్షి) అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా ఆధ్వర్యంలో జిల్లా కార్యదర్శి, ఏ. లక్ష్మి మాట్లాడుతూ 9వార్డు సమస్యల పరిష్కారం గురించి రెండు నెలల క్రితం మున్సిపల్ కౌన్సిలర్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.మ వార్డులో మురికి నీరు చేరటం వల్ల దోమలు, ఈగలు, మనుషులను కుట్టడం ద్వారా వాటి వల్ల కుటుంబ సభ్యులు అనారోగ్యాల బారిన పడుతున్నారు. వార్డు కౌన్సిలర్ కి ఎన్నిసార్లు చెప్పినా మోరీలు తీయించడం లేదు, చెట్ల పొదలు, ఎక్కువ ఉండటం ద్వారా పాములు ,తేలు ఇండ్లలోకి వస్తున్నాయి. రోడ్డుమీద మోరి నీళ్ళు పారుతున్న అధికారులు చూస్తారు తప్ప,సమస్య పరిష్కరించడం లేదు, కాలనీవాసులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. తక్షణమే ఈ సమస్యల పరిష్కారం చేయాలని కోరుతున్నాము. చేయని యెడల పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధమవుతామని, ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమంలో ఐద్వాజిల్లా, సహాయ కార్యదర్శి,సాయి లీల, ఉపాధ్యక్షులు రేణుక, కవిత, సభ్యులు అలివేల, శోభ రంజాబి, సువర్ణ ,పార్వతి, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.